ఆడవాళ్లను లైంగిక వేధింపులు నుండి కాపాడే సరికొత్త 'ఇయర్ ఫోన్స్'!

These headphones saves girls

06:14 PM ON 1st November, 2016 By Mirchi Vilas

These headphones saves girls

బస్సులు, రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలకు రక్షణనిచ్చే సరికొత్త ఇయర్ ఫోన్స్ వంటి పరికరాన్ని నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించారు. తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సమయంలో ఇతరులకు ఆ సమాచారాన్నిచ్చేందుకు అవకాశం లేనప్పుడు ఇది రక్షణగా నిలుస్తుందట. దీనిని కొచ్చికి చెందిన నితిన్ వసంత, ఫౌస్య అమల్హ్, అతుల్ బి రాజ్, జార్జ్ మాథ్యూ రూపొందించారు. దీనిని న్యూరోబడ్ గా పిలుస్తున్నారు. ఇది ఈసీజీ పరికరాల నమూనాలో ఉంటుంది. ఇది యాప్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో నాలుగు ఎలక్ట్రోడులు ఉంటాయి. మెదడు, స్మార్ట్ ఫోన్ కు అనుసంధానమై ఉంటుంది.

మహిళలు భయాందోళనకు గురైన సమయంలో మెదడులోని సంకేతాలను గుర్తిస్తుంది. పరిస్థితి తీవ్రమైన సందర్భంలో ఎటువంటి బటన్ నొక్కకుండానే అత్యవసర సంకేతాలను స్నేహితులకు పంపిస్తుందట. ఈ ప్రక్రియ అంతా కేవలం పది సెకన్లలో జరుగుతుంది. బస్సులో ప్రయాణిస్తున్న తమ స్నేహితురాలిని కొందరు లైంగికంగా వేధించారని, ఆ సమయంలో ఆమె ఫోన్ కూడా తీయలేని స్థితిలో ఉండిపోయిందని వారు తెలిపారు. ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదని ఈ పరికరానికి రూపకల్పన చేసినట్లు వారు వివరించారు.

English summary

These headphones saves girls