ఈ భారత వెబ్ సైట్లు యూరప్ లో హ్యాక్!

These websites were hacking in Europe

01:00 PM ON 8th November, 2016 By Mirchi Vilas

These websites were hacking in Europe

మనకు సంబంధించిన సైట్లను, ఈమెయిల్స్ ని హ్యాక్ చేయడం తరచూ జరుగుతున్నవే. అయితే యూరప్, ఆఫ్రికా ఖండాల్లో భారత ఎంబసీకి చెందిన ఏడు వెబ్ సైట్లు హ్యాక్ అయ్యాయి. ఈ డొమైన్ లకు సంబంధించిన సమాచారాన్ని హ్యాక్ చేసి ఓ వెబ్ సైట్ లో పబ్లిష్ చేసినట్లు బోగట్టా. నెదర్లాండ్స్ కి చెందిన కపుత్సికా అండ్ కసిమీర్జ్ అనే హ్యాకర్లు వీటిని హ్యాక్ చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. దక్షిణ ఆఫ్రికా, లిబియా, ఇటలీ, స్విట్జర్లాండ్, మలావి, మాలి, రొమేనియాల్లో భారత ఎంబసీ వెబ్ సైట్లపై ఈ ప్రభావం పడింది. హ్యాకర్లు ముందు దక్షిణాఫ్రికాలోని భారత ఎంబసీ వెబ్ సైట్లను ఎంపిక చేసుకున్నారు.

వెబ్ సైట్ లోని సమాచారాన్ని హ్యాక్ చేసి 161 మంది భారతీయులకు సంబంధించిన అడ్మిన్ లాగిన్, పాస్ వర్డ్, పేర్లు, పాస్ పోర్ట్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీ, ఫోను నెంబర్లతో పాటు 22 టేబుల్స్ డేటాను లీక్ చేశారు. అయితే ఈ విషయమై ఇప్పటివరకు భారతదౌత్యాధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

English summary

These websites were hacking in Europe