నిజంగా ఈ వీడియో చూస్తే ఖంగుతింటారు

Thief Caught To CC Camera In A Weird Way In Germany

11:16 AM ON 2nd January, 2017 By Mirchi Vilas

Thief Caught To CC Camera In A Weird Way In Germany

దొంగతనాలు ఎక్కడబడితే అక్కడ మూడో కంటికి తెలీకుండా జరిగిపోతున్నాయి. అంతలా నిష్ణాతులుగా దొంగలు అప్ డేట్ అవుతున్నారు. అయితే ఈ దొంగతనం చూస్తే మీరు నిజంగా ఖంగు తినడం ఖాయం. వివరాల్లోకి వెళ్తే, ఏటీఎంలో ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేస్తున్నాడు. ఇంతలో వెనుక నుంచి వచ్చిన ఓ దొంగ ఇతడి జేబులోంచి పర్సు కొట్టేశాడు. అటుఇటు చూస్తూ సీసీ కెమెరా గమనించాడు. దీంతో ఒక్కసారిగా దొంగకి గుబులు మొదలైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సీసీ కెమెరావైపు చూస్తూ దండం పెడుతూ ‘తప్పయింది.. పర్సు తిరిగి ఇచ్చేస్తున్నాను’ అంటూ సైగలు చేశాడు. పర్సును డ్రా చేస్తున్న వ్యక్తి వెనుక పడేసి. అతడిని తట్టి ‘మీ పర్సు కింద పడిపోయింది అని చెప్పాడు’. దీంతో ఆ వ్యక్తి పర్సు తీసుకొని.. దొంగకు షేక్ హ్యండ్ ఇచ్చి కృతజ్ఞతలు తెలిపాడు. సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఎవరో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఇది ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. అయితే, ఈ ఘటన మాత్రం జర్మనీలో జరిగింది.

ఇవి కూడా చదవండి: రాత్రిళ్ళు అక్కడికి వెళ్తే, తిరిగిరావడం కష్టమట ... అయితే అక్కడేం వున్నాయి (వీడియో)

ఇవి కూడా చదవండి: వామ్మో... ఈ నోట్ల యవ్వారం చిప్ దెబ్బేనా?

English summary

A thief was caught to CC Camera in Germany in a weird way while one of the customer was withdrawing money from ATM machine.