దోపిడీ దొంగోడి చేయి నరికేసిన గ్రామస్థులు

Thief Hands Cuts In Bihar

10:12 AM ON 21st January, 2016 By Mirchi Vilas

Thief Hands Cuts In Bihar

అవునండీ , బ్యాంకు దొపిడీకి పాల్పడిన ఓ దొంగ పారిపోతూ , స్థానికులకు చిక్కాడు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న స్థానికులు సదరు దొంగోడి చేయి నరికేశారు. బీహార్ రాష్ట్రంలోని మహువా గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. సాయుధులైన నలుగురు దుండగులు గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ సర్వీస్ సెంటర్‌లోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డారు. సుమారు రూ. 1.70 లక్షలు దోచుకొని పారిపోతుండగా, ఆ నలుగురిలో జితేందర్ కుమార్ అనే దొంగ గ్రామస్తులకు దొరికిపోయాడు. దీంతో అతగాడిని గ్రామస్తులు చితకబాదారు. అంతటితో వదలలేదు, ఆ తర్వాత దోపిడీకి శిక్షగా అతని చేయిని నరికేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గ్రామస్తుల నుండి జితేందర్ కుమార్‌ను రక్షించి, ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ అసలు విషయమేమంటే, దొంగలు పారిపోతున్న సమయంలో అడ్డం వచ్చిన గ్రామస్తులపై కాల్పులకు తెగపడ్డారట. అందుకే ఆగ్రహంతో ఊగిపోతున్న గ్రామస్తుల చేతికి ఓ దొంగ దొరికేసరికి చేయి నరికేశారు.

English summary

A four members gang who theft 1.70 lakhs from Bank Of Baroda Customer Service and one of the theif fired at the villagers and then villagers gets angry and they beat him severely and cut his hand and later that thief was taken to hospital by police and filed case