దొంగతనానికి వచ్చి...యువతిపై అత్యాచారం చేశాడు

Thief Raped Woman In Tamil Nadu Hostel

10:57 AM ON 1st September, 2016 By Mirchi Vilas

Thief Raped Woman In Tamil Nadu Hostel

ఆ మధ్య గోపీచంద్ హీరోగా వచ్చిన ఓ సినిమాలో దొంగతనానికి వచ్చిన వాళ్లలో ఒకడు, హీరోయిన్ సోదరిని రేప్ చేస్తాడు. అత్తారింట్లో గొడవలు జరుగుతాయని అసలు ఇంట్లో దొంగతనమే జరగనట్టు మిన్నకుండి పోతారు. పరువు పోతుందని ఇలా చేస్తారు. దానిమీదే కధంతా నడుస్తుంది. ఇంచుమించు అలానే రియల్ గా ఓ ఘటన జరిగింది. అయితే విషయం పోలీసులకు పిర్యాదు చేసారు. వివరాల్లోకి వెళ్తే, దొంగతనం కోసం హాస్టల్లోకి చొరబడిన వ్యక్తి ఒంటరిగా ఉన్న యువతిని కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. కర్నాటక రాష్ట్రంలో ఈ దారుణం జరిగింది. తమిళనాడుకు చెందిన 25 ఏళ్ళ యువతి పరాప్పన్నా అగ్రహారంలోని పీజీ హాస్టల్ లో మరో మహిళతో కలిసి ఉంటోంది. ఐటీ ఉద్యోగిని అయిన ఆమె అనారోగ్యంతో విధులకు హాజరు కాకుండా హాస్టల్లో ఉండిపోయింది. అయితే, దొంగతనం కోసం ఆ హాస్టల్లోకి చొరబడిన ఓ వ్యక్తి ఒంటరిగా ఉన్న ఆ యువతిని కత్తితో బెదిరించి రేప్ చేశాడు. ఒంట్లో బాగోపోయినా, అత్యాచారం చేసాడు. మొత్తానికి బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:రెబల్ స్టార్ దర్శించిన ఆలయానికి ఉగ్రవాద ముప్పు

ఇవి కూడా చదవండి:జనతాగ్యారేజ్ లో ప్రిన్స్

English summary

A Thief in Tamilnadu raped and IT employee who was living in a hostel along with her friend. Actually thief came to theft something in that hostel and he found that the girl was sleeping and there was no body in the hostel. Thief warned her with Knife and raped her. Later she complained in the near by police station about this incident.