మల్లికాపై పారిస్ లో దాడి.. ఇంతకీ దాడి చేసిందెవరో?

Thieves attack on Mallika Sherawat in paris

11:49 AM ON 18th November, 2016 By Mirchi Vilas

Thieves attack on Mallika Sherawat in paris

ఈమధ్య బాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో గాని కొందరు తారలు ప్రచారం కోసం ఏదేదో చేస్తున్నారు. అయితే ఆతర్వాత విషయం తెల్సి ఆశ్చర్యపోవడం అందరి వంతు అవుతోంది. అయితే, ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ పై ఫ్రాన్స్ లో దాడి జరిగిందట. సహజంగానే సంచలనం సృష్టించింది. ఇంతకీ విషయం ఏమంటే, పారీస్ నగరంలోని అప్ మార్కెట్ 16లో ఉన్న ఆమె సొంత అపార్ట్మెంట్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు నేరుగా ఆమె వద్దకు వచ్చి టియర్ గ్యాస్ వదిలారు. మల్లికపై పిడిగుద్దులు కురిపించారు. తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.

తీవ్రగాయాలతో ఉన్న మల్లికను ఆస్పత్రికి తరలించారు. దాడి జరిగిన సమయంలో ఆమె స్నేహితుడైన ఫ్రెంచి వ్యాపారవేత్త లొవెర్ సిరిల్ అక్సెన్ ఫాన్స్(45) పక్కనే ఉన్నాడు. వీరిద్దరూ గత శుక్రవారం ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, దొంగతనం చేయడానికి వచ్చి ఈ దాడి చేశారని పోలీసులు భావిస్తున్నారు. నింధితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా కొన్ని రోజులు క్రితం ఇదే అపార్ట్మెంట్ పరిసరాలలో ప్రముఖ హాలీవుడ్ స్టార్ కిమ్ కర్దేషియాన్ పై కూడా దాడి జరిగింది.

English summary

Thieves attack on Mallika Sherawat in paris