షార్ లో ప్రవేశించిందెవరు ? ....

Thieves enters into SHAR

10:49 AM ON 4th March, 2016 By Mirchi Vilas

Thieves enters into SHAR

అందు లేదు ఇందు లేదు అన్న చందంగా అన్ని చోట్లా చోరులు తమ ఉనికి చాటుకుంటున్నారు. ఎంత సెక్యూరిటీ వున్నా కొరగాకుండా పోతున్నాయి. అందరి కళ్ళూ గప్పి ఆగంతకులు ఎలా ప్రవేశిస్తున్నారో అంతుబట్టని విషయం.  తాజాగా శ్రీహరికోట భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో దొంగలు పడ్డారట. కట్టు దిగ్గమైన భద్రతా ఏర్పాట్ల నడుమ, అది కూడా ఎక్కడో మారుమూల కాదు.. అత్యంత కీలకమైన, విలువైన, పేలుడు పదార్థాలు దాచి ఉంచే భవనాన్నే చోరులు లక్ష్యంగా ఎంచుకుని అందులో ప్రవేశించడం మామూలు విషయం కాదు. అసలు ఇక్కడ దూరింది , దొంగలా , మరెవరైనా వచ్చారా అన్నది తేలాల్సి వుంది.   ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన విషయం బయటకు రాకుండా షార్‌ యాజమాన్యం అత్యంత జాగ్రత్తలు తీసుకొంది. అందుబాటులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే,  అడవిలో ఇతర వసతులకు సంబంధం లేకుండా ఏర్పాటు చేసిన ఈ భవనంలో ఏమైనా ప్రమాదాలు జరిగినా, ఇతర వాటికి నష్టం వాటిల్లాకుండా వుంటుంది. ఈ భవనంలో ఆర్‌హెచ్‌ 125, ఆర్‌హెచ్‌ 560, సౌండ్‌ రాకెట్‌ కాంప్లెక్సు సంబంధించిన సామగ్రిని నిల్వ ఉంచుతారట .  దాంతోపాటు రాకెట్లలో వాడే ఎక్స్‌ప్లోజేస్‌ను, వివిధ రకాల మోటార్లు ఇక్కడ ఉంచుతారు. ప్రమాదకర డిగ్నేటర్లు, రాకెట్‌ను పేల్చి వేసే పదార్థాలు ఇందులో ఉంటాయి. భవనానికి విద్యుత్తు సదుపాయం ఉన్నప్పటికీ,  ఉద్యోగులు ఎవరైనా పని పై వచ్చినపుడే సరఫరా ఇస్తారని తెలుస్తోంది. దాంతోపాటు ఈ భవనానికి కట్టుదిట్టమైన భద్రత ఉండడంతో పాటూ, ఈ విభాగానికి సంబంధించిన అధికారులు, ఉద్యోగులు మాత్రమే వచ్చి తలుపులు తెరవాలి. భవనానికి పూర్తిగా కాంక్రీట్‌ గోడే వుంటుంది. 

1/5 Pages

అక్కడే వదిలేసిన సామాగ్రి .... 

  సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో రెండో గేటు తర్వాత సౌండింగ్‌ రాకెట్‌ కాంప్లెక్సు (ఎస్‌ఆర్‌సీ)కి వెళ్లే రహదారికి కిలోమీటరు దూరాన మ్యాగ్‌జైన్‌ బిల్డింగ్‌ (అడవిలో వివిధ రకాల ప్రమాదకర పేలుడు పదార్థాలు దాచే భవనం) ఉంది. ఇందులో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు. అయితే వారు ఎంతమంది, ఏవిధంగా ఇక్కడకు వచ్చారో తెలియదు.  తమతో పాటు తెచ్చుకున్న గడ్డపారలు, వివిధ రకాల సామగ్రిని ఉపయోగించి,   మ్యాగ్‌జైన్‌ బిల్డింగ్‌లోని తలుపులకు ఉన్న తాళాలను పగలగొట్టారని తెలుస్తోంది. ఎందుకంటే  గడ్డపారలు, ఇతర సామగ్రిని కూడా మ్యాగ్‌జైన్‌ బిల్డింగ్‌ వద్దే వదిలి వెళ్లారట.  భవనంలో లభించిన టూల్‌ కిట్‌ సాయంతో అక్కడే ఉన్న హై ఎఫిషియన్సీ మోటారును తీసుకెళ్లేందుకు ప్రయత్నించి, అది బరువుగా ఉండటంతో విరమించుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత భవనం పైకి ఎక్కినట్లు కూడా తెలుస్తోంది. ఉరుములు, మెరుపులు, పిడుగుపాటుకు పడకుండా ఉండేలా ఆ భవనంపై ఏర్పాట్లు చేయడం వలన, అక్కడ రాగి ప్లేట్లు, తీగలు ఉండటంతో దొంగలు వాటిని కత్తిరించుకుని వెళ్లినట్లు భోగట్టా.

English summary