ఏటీఎం ల పై విరుచుకు పడ్డ దోపిడి దొంగలు 

Thieves Looted Three Atm's in Telangana

01:45 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Thieves Looted Three Atm's in Telangana

తెలంగాణా లోని మెదక్‌ జిల్లాలో నిన్నఅర్ధరాత్రి దోపిడి దొంగలు రెచ్చిపోయారు. పలు ప్రాంతాలలో ఏటీఎం అను ధ్వంసం చేసి దోపిడీకి తెగబడ్డారు. ఒకే సమయంలో మూడు ఏటీఎం లను ధ్వంసం చేసారు.

మొదటగా మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి పాత బస్టాండ్‌ సమీపంలో రాత్రి 2:30 గంటలకు ఇండి క్యాష్‌ ఏటీఎం లోకి ముసుగులతో వచ్చిన నలుగురు దుండగులు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, ఏటీఎం మిషన్‌ను గ్యాస్‌ కట్టర్‌ సహాయంతో విరగొట్టి అందులోని 3.21 లక్షల రూపాయలను దోచుకున్నారు.

ఆ తరువాత దోపిడి దొంగలు సంగారెడ్డి నుండి కౌడిపల్లి చేరుకున్నారు. కౌడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ దగ్గర్లో ఉన్న ఏటీఎం ను దోచుకోవడానికి విఫలయత్నం చేసారు. అది విఫలం కాండంతో కౌడిపల్లి నుండి మెదక్‌ చేరుకున్న దుండగుల ఆటోనగర్‌ సమీపంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం ను దోచుకోవడానికి గ్యాస్‌ కట్టర్‌ సహాయంతో విరగొట్టడానికి ప్రయత్నించగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి సరిగ్గా అదే సమయంలో గస్తీతో పోలీసులు గమనించడంతో బోలేరో వాహనంలో పరారయ్యారు. దొంగలను గమనించిన పోలీసులు వారిని వెంబడించి, దొంగల పై కాల్పులు సైతం జరిపారు.

మెదక్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం లో మూడు లక్షల రూపాయలు కాలి బూడిదయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న మెదక్‌ ఎస్పీ సుమతి ఏటీఎం లను సందర్శించి, వాటి వివరాలను సంబంధిత బ్యాంకు మేనేజర్లను అడిగి తెలుసుకున్నారు.

ఎస్పీ సుమతి మాట్లాడుతూ ఏటీఎంల చోరికి పాల్పడిన దొంగలను పట్టుకుని తీరుతామని అన్నారు. దొంగలను వెంబడించిన గస్తీ పోలీసులు హెడ్‌కానిస్టేబుల్‌ ఎక్బాల్‌, కానిస్టేబుల్‌ వీరప్ప, హోంగార్డు విష్ణులకు నగదు రివార్డును ప్రకటించారు.

English summary

Yesterday night thieves has looted three ATM's in medak district,Telangana State. They have been looted ammount of 3.2 lakhs