ఈ దొంగలకు ఇంట్లో డబ్బు దొరకలేదని ఏం చేశారో తెలిస్తే నవ్వాపుకోలేరు..

Thieves stolen fruits from fridge in Chennai

06:33 PM ON 24th August, 2016 By Mirchi Vilas

Thieves stolen fruits from fridge in Chennai

కొంత మంది సీరియస్ దొంగలను చూసి ఉంటాం(డబ్బు కోసం అవతల వ్యక్తులను చంపేసి వాళ్ళ దగ్గర దోచుకుని వెళ్లే దొంగలు), మరికొంత మంది దొంగలను చూసి ఉంటాం(ఎటువంటి హాని చెయ్యకుండా దోచుకెళ్లే దొంగలు). కానీ ఇలాంటి వింత దొంగలను సినిమాల్లో తప్ప బయటేప్పుడూ చూసి ఉండరు. ఆ వివరాల్లోకి వెళితే.. నార్త్ చెన్నైలోని న్యూ వాషర్ మెన్ పేటలోని ఓ ఇంట్లో ప్రవేశించిన దొంగలు నగలు, డబ్బు లేకపోవడంతో నిరాశకుగురై వంటగదిలో ఆమ్లెట్ వేసుకొని తిని, ఫ్రిజ్ లో ఉన్న పండ్లు దోచుకెళ్లారు. న్యూ వాషర్ మెన్ పేట పిళ్లయార్ కోవిల్ వీధికి చెందిన రాజు(45) తన కుటుంబంతో ఈ నెల 21న నాగపట్టణం సమీపంలోని వేలాంకన్నికి వెళ్లి మంగళవారం ఉదయం తిరిగొచ్చారు.

ఇంటి తాళం బద్దలై ఉండడం చూసి ధిగ్ర్భాంతికి గురై లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న వస్తువులు, వంటగదిలో ఉన్న పాత్రలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బయటకు వెళ్లే సమయంలో బీరువాలో ఉన్న నగలు, డబ్బు వారు వెంట తీసుకెళ్లడంతో కన్నం వేసేందుకు వెళ్లిన దొంగలకు నిరాశ మిగిలింది, దీంతో వారు వంటగదికి వెళ్లి ఆమ్లెట్ వేసుకు తిని, ఫ్రిజ్ లో ఉన్న పండ్లు ఎత్తుకెళ్లారు. ఈ విషయమై వాషర్ మెన్ పేట పోలీసులకు రాజు ఫిర్యాదుచేయడంతో వారు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Thieves stolen fruits from fridge in Chennai