'తిక్క' చూపిస్తున్న సాయిధరమ్ తేజ్(వీడియో)

Thikka movie teaser

06:41 PM ON 21st July, 2016 By Mirchi Vilas

Thikka movie teaser

'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'సుప్రీమ్' వంటి హిట్ చిత్రాల తరువాత సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'తిక్క'. ఈ చిత్రం టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. మాములుగా టీజర్ లో కథ గురించి చెప్పినా.. చెప్పకపోయినా.. హీరోని మాత్రం స్టైలిష్ గా, హీరోయిజం ఉట్టిపడేలా చూపిస్తుంటారు. అయితే తిక్కలో మాత్రం కాస్త భిన్నంగా చూపించారు. 'జగమే మాయ' అనే పాట బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుండగా.. వచ్చే ఓ యాక్సిడెంట్ సన్నివేశంలో సాయిధరమ్ తేజ్ కనిపిస్తాడు. ఆ తర్వాత 'నువ్వు ఒక్క మాట అడిగి చూడు... హీరో ఏంటి? టెర్రరిస్టు కూడా అయిపోతాను' అనే డైలాగ్ చెబుతాడు సాయిధరమ్.

అయితే ఎవరు ఎవర్ని అడగాలో ఏం అడగాలో మాత్రం తెలీలేదు. బహుశా అమ్మాయే అడగాల్సి వుంటుంది. అయితే తాగుబోతు రమేష్ చెప్పే డైలాగులు మాత్రం ఇది ప్రేమకథ అనే విషయం స్పష్టం చేస్తుంటుంది. 'ప్రేమ బబుల్ గమ్ భయ్యా... మొదట తియ్యగా ఉంటుంది ఆ తర్వాత చప్పగా మారుతుంది. దోస్తాన్ లు అలా కాదు చాక్లెట్ లా ఎప్పుడూ తియ్యగా ఉంటారు' అంటూ తాగుబోతు రమేష్ చెప్పిన డైలాగ్ లు బానే పేలాయి. సునీల్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంలో సాయిధరమ్ సరసన లరిస్సా బొనెసి, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటించారు.

English summary

Thikka movie teaser