నిద్ర గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు

Things you need to know about sleep

10:52 AM ON 26th December, 2015 By Mirchi Vilas

Things you need to know about sleep

నిద్ర అనేది మనకు ప్రకృతి ఇచ్చిన వరం. మన దైనందిక జీవితంలో నిద్ర అనేది సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుంది. నిద్ర సరిగ్గా పట్టకపోతే ఆరోగ్యం పాడవటమే కాకుండా ఆ రోజంతా బద్దకంగా ఉంటుంది. నిద్ర అనేది మనిషిలో అలసటను పోగొట్టి నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. సామాన్యంగా పిల్లలకు పెద్దలకంటే ఎక్కువగా నిద్ర అవసరం అవుతుంది.  ఇది వారి శారీరక పెరుగుదలకు మానసిక అభివృద్ధికి చాలా అవసరం. అప్పుడే పుట్టిన పిల్లలకు అయితే సుమారు 18 గంటల నిద్ర అవసరం, వారు పెరుగుతున్న కొద్దీ నిద్ర తగ్గిపోతుంది. పెద్దవారు అయితే రోజుకి ఎనిమిది గంటల నిద్ర సరిపోతుంది.

1/15 Pages

ఎంత సేపు నిద్ర అవసరం

నిద్ర అనేది ఎక్కువ సమయం ఉండాలా తక్కువ సమయం ఉండాలా అనే విషయంలోకి వస్తే 10 నుంచి 20 నిమిషాల నిద్ర భావాలు లేకుండా చురుకుదనంను కలిగిస్తుంది. అలాగే 90 నుంచి 120 నిమిషాల నిద్ర జడత్వంను  తొలగించటమే కాకా మానసిక ప్రాసెసింగ్, చురుకుదనంలో సాయపడుతుంది. నిద్ర పూర్తి చక్రంలో మెదడు నెమ్మదిగా లోతైన నిద్ర ద్వారా మరొక దశలోకి వెళ్లి కలల లోకంలోకి వెళ్ళుతుంది. నిద్ర లేకపోవుట వలన ఒత్తిడి కలుగుతుంది నిద్ర లేకపోవుట వలన అమెరికన్స్ 20 శాతం, జర్మన్లలో ఎనిమిది శాతం, బ్రిటిష్ నివాసితులలో తొమ్మిది శాతం మంది వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ జీవితాల్లో తీవ్రమైన ఆందోళనను ఎదుర్కొన్నారు.

English summary

Do you know how many hours can normal person sleep per day? Most of us dont know answer for this question. If you want to protect your health you need to know about sleep. Read this article for more information.