మిమ్మల్ని రోడ్డు ప్రమాదాల నుండి కాపాడే సరికొత్త యాప్!

This app will saves you from road accidents

11:01 AM ON 8th November, 2016 By Mirchi Vilas

This app will saves you from road accidents

సాధారణంగా మనం ఎవరైనా బయటకు వెళుతుంటే వెళ్లి వస్తాం అని చెప్పడం రివాజు. దానికి ఇంట్లో వాళ్ళు క్షేమంగా వెళ్లి లాభంగా రండి.. అని చెప్పడం జరిగేది. ఇదంతా ఆరోజుల్లో కానీ ఈరోజుల్లో ఏక్షణాన ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి. దీనికి కారణం రోజురోజుకి పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు. ప్రపంచంలో ఏడాదికి 1.17 మిలియన్ మంది రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతుంటే.... మన దేశంలో ప్రతీ నాలుగు నిమిషాలకి ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. అంటే ఏడాదికి దాదాపు 1,40,000 మంది చనిపోతున్నారు. ఈ ప్రమాదాలకి మొదటి కారణం తాగి నడపడం వల్ల అయితే.. రెండో కారణం ఫోన్ వాడుతూ నడపడం. అందుకే లాభంగా రాకపోయినా పర్వాలేదు.. క్షేమంగా వస్తే చాలు అని ఇంట్లో వారంతా కోరుకుంటారు.

వాహనం నడిపే ప్రతీ ఒక్కరికి ఫోన్ వాడుతూ వాహనం నడపకూడదని తెలుసు. అయినా చాలా మంది ఈ రూల్ ని పట్టించుకోరు. ఇంపార్టెంట్ కాల్ వస్తుందని, అర్జెంటుగా మెసేజ్ చూసుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తారు. నిజానికి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కొన్నిసార్లు పదేపదే కాల్స్ వస్తూ ఉంటాయి. అలాంటి సమయాల్లో కాల్ రిసీవ్ చేయక తప్పదు. వాహానాన్ని రోడు పక్కకు ఆపి మాట్లాడితే పర్వాలేదు... కానీ కొందరు వాహనం నడుపుతూనే కాల్ రిసీవ్ చేసుకుంటారు. ఇలాంటివారు వీరికే కాకుండా పక్కవారికి కూడా ఎంత ప్రమాదం తలపెడుతున్నారనే విషయం మరచిపోతారు.

మద్యం సేవించి వాహనం నడపడం ఎంత ప్రమాదమో... ఫోన్ వాడుతూ వాహనం నడపడం కూడా అంతే ప్రమాదం. ఇలాంటి ప్రమాదాలకు చెక్ పెట్టడానికే ఒక కొత్త యాప్ ను ప్రవేశపెట్టారు.

1/4 Pages

ఈ యాప్ పేరు(Kruzr) క్రుజర్. ప్రస్తుతానికి ఈ యాప్ కేవలం ఆండ్రాయిడ్ లోనే లభిస్తుంది. త్వరలో ఐ ఓ.ఎస్.లో కూడా లాంచ్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ లో లాంచ్ అయిన ఈ యాప్ వాడితే మిమ్మల్ని రోడ్డు ప్రమాదాల నుండి కాపాడుతుంది.

English summary

This app will saves you from road accidents