అందం వెనుక ఉన్మాదం.. సూసైడ్ బాంబర్ అవ్వడమే లక్ష్యమట

This beautiful girl want to become suicide bomber

10:50 AM ON 4th July, 2016 By Mirchi Vilas

This beautiful girl want to become suicide bomber

ఉగ్రవాదం పెచ్చుమీరిపోతోంది. అందమైన అమ్మాయిలను ఈ రొంపిలో దింపి ఉన్మాదులుగా మార్చేస్తున్నారు. ఇక్కడ చూడండి అందం ఉంటే సుఖం ఏమిటి దాని వెనక క్రూరత్వం దాగుంది.. రక్తపాతం జరగాలన్న ఉన్మాదం పెల్లుబికుతోంది. ఇంతకీ ఎవరంటే, ఆ అమ్మాయి పేరు తుబా గొండాల్.. వయస్సు జస్ట్ 22 ఏళ్ళు. చదువు, ఉద్యోగాల మాట పక్కన బెట్టి జిహాదీ బ్రైడ్ మేకర్ గా మారిపోయింది. అంటే బ్రిటన్ లోని ముస్లిం యువతులను సిరియాకు వచ్చి యువకులైన జిహాదీలను పెళ్లి చేసుకోవాలని కోరుతోంది. ఆన్ లైన్ లో వాళ్లకు గాలం వేస్తున్న తుబా.. సూసైడ్ బాంబింగ్ లో అమరురాలైపోవాలన్నదే తన ఆశయమని చెబుతోంది.

లండన్ లోనే చదువుకున్నప్పటికీ బ్రిటన్ ను శత్రు దేశంగా పరిగణిస్తున్న ఈమె.. ఉగ్రవాదులు దేశ భక్తులని అభివర్ణిస్తోంది. ఏడాది కాలంగా సిరియాలోని రక్కా నగరంలో ఉంటున్న ఈమె సదా ఇంటర్నెట్ లో బ్రిటన్ లోని అందమైన ముస్లిం అమ్మాయిలను తనలా జిహాదీగా మారిపోవాలని, ఇక్కడ మీకు అన్ని సుఖాలూ లభిస్తాయని ప్రోత్సహించడం విశేషం. బ్రిటన్ లో ఒకప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకుందామని ఎన్నోసార్లు ప్రయత్నించా.. కానీ అధికారులు నాకు లైసెన్స్ మంజూరు చేయలేదు. అయినా సిరియాలో ఇప్పుడు వాహనాలను హాయిగా డ్రైవ్ చేయగలుగుతున్నా.. నాకు సులభంగా లైసెన్స్ లభించింది అని తుబా అంటోంది.

ప్యారిస్ ను తగులబెట్టండి అని స్లోగన్ ఇస్తున్న ఈ యువతిలాంటి వాళ్ళు ఇంకా సిరియాలో చాలామందే ఉన్నారని బ్రిటన్ ప్రభుత్వ అంచనా వేసింది.

English summary

This beautiful girl want to become suicide bomber