అగ్ర రాజ్యాన్ని కుదిపేస్తున్న వీడియో

This Cop Video Going Viral Over The Internet

11:11 AM ON 9th July, 2016 By Mirchi Vilas

This Cop Video Going Viral Over The Internet

ఆ వీడియో చూస్తే, చాలు అందరూ షాకవుతారు..అగ్ర రాజ్యాన్ని కుదిపేస్తోంది. కారు ముందు సీట్లో ఇద్దరుంటారు. ఒకరు డ్రైవింగ్ సీట్లో ఇంకొకరు ఆ పక్క సీట్లో. డ్రైవింగు సీట్లోని వ్యక్తికి ఒళ్లంతా రక్తం.. పక్కనే కారు విండోలోంచి తుపాకీతో బెదిరిస్తున్న పోలీస్. గాయపడిన వ్యక్తి ఆ పోలీసును ప్రాథేయపడుతుంటాడు. ''సార్.. సార్... వద్దు సార్.. ఇప్పటికే నాలుగుసార్లు కాల్చారు. చచ్చిపోతాను సార్.. వద్దు సార్.." అంటూ బతిమాలుతుంటాడు. వెనుక సీట్లోంచి ఆయన కుమార్తె ఏడుస్తూ ఉంటుంది. పక్క సీట్లోని గర్ల్ ఫ్రెండ్ భయంతో బిక్కచచ్చిపోయి ఉంటుంది. ఈ వీడియో ఇప్పుడు అమెరికాను కుదిపేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే, కారులో ఉన్న మహిళ పేరు డైమండ్ రెనాల్డ్స్... బాయ్ ఫ్రెండ్ ఫిలాండో కాస్టిలే నాలుగేళ్ల కూతురుతో కలిసి కారులో వెళ్తోంది. ఫిలాండోయే డ్రైవింగ్ చేస్తున్నాడు. అంతలోనే పోలీసు కారు ఒకటి సర్రును దూసుకొచ్చి అడ్డంగా ఆగుతుంది. అందులోంచి పోలీస్ ఆఫీసర్ దిగి విండోలోంచి తుపాకీ గురిపెట్టి ఫిలాండోను కిందకు దిగమని అడుగుతాడు. కాస్టిలే ఏదో చెబుతుండగానే, పోలీసు అధికారి అతణ్ని నాలుగు సార్లు కాల్చేస్తాడు.

అక్కడి నుంచే ట్విస్టు మొదలైంది. పోలీసు కాల్చేవరకు చాలా ఆందోళన చెందిన రేనాల్డ్స్ ఆ తరువాత ఆ అకృత్యాన్ని ప్రపంచానికి చెప్పడానికి వెంటనే ఫేస్ బుక్ లైవ్ వీడియో స్ట్రీమింగ్ ను ఆన్ చేసింది. తన బాయ్ ఫ్రెండును చంపొద్దంటూ పోలీసును వేడుకుంది. నాలుగుసార్లు కాల్చారు సారు.. ఇక ఆపండి సార్ అంటూ ఏడ్చింది. ఆమె నాలుగేళ్ల కుమార్తె కూడా భయంతో తల్లిని గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది.

దీంతో పోలీసుల దారుణం ప్రపంచానికి తెలిసిపోయింది. సాక్ష్యంగా ఆ వీడియో నిలవడంతో వెంటనే ప్రపంచమంతా పాకిపోయింది.అంతేకాదు అమెరికాలోని చానల్సన్నీ ఆ వీడియో ప్రసారం చేశాయి. రేనాల్డ్సు నల్ల జాతీయురాలు కావడంతో ఆమెకు జరిగిన అన్యాయంపై అమెరికాలోని నల్లజాతీయులు ఆగ్రహించారు. అమెరికా అంతటా దీనిపై ప్రదర్శనలు హోరెత్తుతున్నాయి.. ముఖ్యంగా డల్లాస్ నగరం ఆందోళనలతో అట్టుడుకుతోంది. నల్లజాతీయుల దాడుల్లో నలుగురు పోలీస్ అధికారులు మరణించారు. జాతి వివక్ష కొనసాగడం పై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.

ఇవి కూడా చదవండి:భర్తపై రేప్ కేసు పెట్టిన భార్య

ఇవి కూడా చదవండి:మామిడి చెట్టు కొమ్మ నరికేశారు... అయినా కాయలు కాసాయి

English summary

A Police man in America came fastly in apolice car and he used to shoot the man and the whole incident was uploaded by his girl friend who sat behind him and due to this so many black citizens in America came on to roads and they have started protest against America police and they killed 4 police men.