ఈమె నిజంగా అమ్మ కూతురేనా? ఫోటో వెనుక దాగిన అసలు రహస్యం ఇదే

This Fake Photo Goes Viral Over The Internet As Jayalalitha Daughter

10:46 AM ON 13th December, 2016 By Mirchi Vilas

This Fake Photo Goes Viral Over The Internet As Jayalalitha Daughter

తమిళనాడులో దివంగత సీఎం జయలలిత ఆసుపత్రిలో వున్నప్పటినుంచి కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో కొన్ని షాకింగ్ విషయాలున్నాయి. దీంతో అందరిలో అనేకరకాల సందేహాలున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ఫోటోలో ఉన్నది జయలలిత సొంత కూతురంటూ తీవ్ర స్థాయిలో గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. జయ మరణం తర్వాత ఈ ఫోటో మరింతగా వైరల్ అయ్యింది. Ph.D దాకా చదివిన ఈమె ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డదంటూ పుకార్లు కూడా పుట్టించారు నెటీజన్లు. చూడడానికి జయలలిత లాగున్న ఈ ఫోటోను చూసి చాలా మంది నమ్మేశారు. ఇక మరికొందరైతే…ఇది జయలలిత యంగ్ ఏజ్ లో ఉన్న ఫోటో అంటూ వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అంతాకాదు భవిష్యత్తు సీఎం కూడా ఈమె అంటూ కూడా మరికొన్ని వార్తలు వచ్చేసాయి.

అయితే ఈ ఫోటో అసలు వాస్తవాన్ని ప్రముఖ గాయని శ్రీపాద చిన్మయి బయటపెట్టింది. తన ఫేస్ బుక్ లో….ఈ ఫోటో మీద వివరణ ఇస్తూ ఓ పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఉన్నామె పేరు దివ్యా రామనాథన్, వీరిది మంచి శాస్త్రీయ సంగీత కుటుంబం. ప్రముఖ మృదంగ విద్వాన్ వి.బాలజీ కుటుంబానికి చెందినవారు. ఆమెకు తమిళనాడు రాజకీయాలతోగానీ, జయలలితతోగానీ ఏవిధమైన సంబంధం లేదు' అని ఆపోస్టులో చిన్మయి స్పష్టం చేసింది. దివ్యారామనాథన్ ఆమె భర్త కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది.

అంతేకాదు, చిన్మయి పోస్టింగ్ పై , దివ్యా రామనాథన్ మరిది త్రివేండ్ర బాలాజీ స్పందిస్తూ, ‘అవును ఇది మా సోదరుడు..ఆమె భార్య ఫొటో’ అంటూ ధృవీకరించారు. మొదటి ఫోటో 2008లో నా పెళ్లి సంధర్భంగా దిగినది, రెండవది ఇటీవల కాలంలో దిగినదని వివరణ కూడా త్రివేండ్ర ఇచ్చారు.

English summary

Recently AIDMK Party President and Tamilnadu's Chief Minister Jayalalitha was died and there was some fake news going viral all over the internet that one of the woman was the daughter of Jayalalitha. Now Singer Chinmayi gave clarity about that pic that she was not the daughter of Jayalalitha.