ఈ బ్యూటీ రోజుకి 22 గంటలు పడుకుంటుందట.. ఎందుకో తెలుసా?

This girl is suffering with Sleeping Beauty Syndrome

11:13 AM ON 16th November, 2016 By Mirchi Vilas

This girl is suffering with Sleeping Beauty Syndrome

మనిషి సగం జీవితం నిద్రకే పోతుంది. అయితే ఒక్క మనిషే కాదు ఏ ప్రాణికైనా నిద్ర తప్పనిసరి. కాకపొతే, నిద్రించే సమయంలోనే తేడా ఉంటుంది. కోలా అనే జంతువు అత్యధికంగా 20 గంటలకుపైగా నిద్రిస్తుందట. ఆ తర్వాత స్థానంలో గబ్బిలాలు19 గంటలకు పైగా నిద్రపోతాయి. మనుషులు తమ జీవితంలోని ఒక్కో దశలో ఒక్కోలా నిద్రపోతారు. శిశువుగా ఉన్నప్పుడు 16 గంటలు.. కౌమార దశలో 9 గంటలకు పైగా.. పెద్దయ్యాక 6 నుంచి 8 గంటలు నిద్రపోతారు. ఎప్పుడైనా బాగా అలిసిపోతే.. మరో రెండు మూడు గంటలు ఎక్కువ సేపు పడుకుంటారు. కానీ.. హిథర్ అనే మహిళ మాత్రం రోజుకు 22 గంటలు పాటు నిద్రిస్తూనే ఉంటుంది.

ఒక వేళ లేచినా, వెంటనే అలిసిపోతుందట. అదేదో కావాలని నిద్రపోవడం కానేకాదు. అదో వింత వ్యాధి. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

1/6 Pages

కెనడాకి చెందిన 37 ఏళ్ల హిథర్ కొన్నాళ్ల క్రితం వరకు అందరిలాగే ఉండేది. డిగ్రీ పూర్తి చేసి బయాలజిస్టుగా ఉద్యోగం చేసేది. 2009 వరకు ఆమె ఆడుతూ.. పాడుతూ ఎంతో చలాకీగా ఉండేది. కానీ.. ఓ వింత వ్యాధి హిథర్ జీవితాన్ని మంచానికే పరిమితం చేసింది. ఆ వ్యాధి వల్ల పడుకోవడం తప్ప మరేపని చేయలేని స్థితికి చేరింది.

English summary

This girl is suffering with Sleeping Beauty Syndrome