రోజా జబర్దస్త్‌కు టాటా చెప్పింది ఇందుకేనా?

This is the reason for Roja quitting from Jabardasth

01:16 PM ON 22nd April, 2016 By Mirchi Vilas

This is the reason for Roja quitting from Jabardasth

కుర్రకారుని విపరీతంగా అలరించిన జబర్దస్త్ లో సినీనటి, వైసిపి ఎంఎల్ఎ రోజా, నటుడు నాగబాబు జడ్జీలుగా ఉన్న సంగతి తెల్సిందే. ఈ ప్రోగ్రాం బాగా క్లిక్ అయింది కూడా.. అయితే ఈ ప్రోగ్రాం నుంచి రోజా తప్పుకుంటోంది. ఎందుకంటే, ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, సస్పెండ్ కావడం, మంత్రి పీతల సుజాత చేసిన కామెంట్లు, బ్లూఫిల్మ్ లో నటించిందని ఆరోపణలు ఎదుర్కొన్న పిమ్మట రోజా కొంత మనశ్శాంతికి దూరమైందని అంతా చెప్పుకుంటున్నారు. ఆ తరువాత ఎక్కడికి వెళ్ళినా రిపోర్టర్లు అదే అంశం పై ప్రశ్నలు వేస్తుండడం కూడా జరుగుతుంది. ఆ ఫలితం కాస్తా ఆమె నిర్వహిస్తున్న జబర్దస్త్ ప్రోగ్రాం పై పడింది.

టీవీలో ఆమెను ఇది వరకటితో పోల్చితే కాస్త నిరాశగా కనిపిస్తుంది. ఎదుటవారు ఆమెను అదే కోణంలో చూస్తున్నారా? అనే ఆలోచన ఆమెను ఆ సీట్లో కూర్చోనివ్వడం లేదు. అందుకే రోజా తనకుతానుగానే జబర్దస్త్ షో నుండి తప్పుకోబోతుందని వార్తలు వస్తున్నాయి.

English summary

This is the reason for Roja quitting from Jabardasth. Minister Peethala Sujatha blamed Roja for she is acted in a bluefilms in olden days. For that comments she want to quit from Jabardasth show.