ఈ బుడతడు ఐడియా ఖరీదు 200 కోట్లు..!

This kid idea cost is 200 crores

05:58 PM ON 16th May, 2016 By Mirchi Vilas

This kid idea cost is 200 crores

ఒకరు రోజంతా చెమటోడ్చి కష్టబడితే 500 కూడా సంపాదించలేరు.. అదే ఒకరు చిన్న చెమట బొట్టు కూడా ఖర్చు పెట్టకుండా రోజుకి లక్షలు, కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు.. అంటే ఇక్కడ కష్టంతో పని లేదు, కేవలం తెలివితోనే పని. ఇలాంటి తెలివే ఒక బుడ్డోడిని కోట్లు ఆఫర్ వచ్చేలా చేశాయి.. అసలు విషయంలోకి వెళ్తే.. మ్యాటర్ లోకి వెళితే.. అమెరికాలో 14 ఏళ్ల టేలర్ రోసెంథాల్ కు వచ్చిన ఓ చిన్న ఆలోచన.. అతడిని బిజినెస్ ప్రపంచానికి పరిచయం చేసింది. టేలర్ ఐడియా ఏమిటంటే.. వివిధ రకాల ఫస్ట్ ఎయిడ్ కిట్ లతో కూడిన ఏటీఎం మెషీన్ ను తయారు చేయడమే.

శరీరానికి గాయాలైనా, ఎండలో సొమ్మసిల్లినా, కాలిన గాయాలైనా… ఫస్ట్ ఎయిడ్ కిట్ లను ఈ వెండింగ్ మెషీన్ అమ్ముతుంది. సమస్య ఏంటో సెలక్ట్ చేసుకుని.. బటన్ ప్రెస్ చేస్తే, అందుకు సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ కిట్ బయటకు వచ్చేస్తుంది. ఈ వినూత్న ఆలోచన ఆ చిన్నారి బుర్రకి ఎలా తట్టిందంటే.. బేస్ బాల్ పోటీలు జరుగుతున్న వేళ, తన స్నేహితులు గాయపడితే, వారికి ప్రాథమిక చికిత్సల కోసం మెడికల్ షాపులకు పరుగులు పెట్టే తల్లిదండ్రులను చూశాడు. దీంతో టేలర్ కు ఈ ఐడియా వచ్చింది. ‘రెక్ మెడ్’ పేరిట ఓ స్టార్టప్ సంస్థ స్దాపించి ఒక్కో మెషీన్ ను రూ. 35 లక్షలకు అమ్ముతుంటే.. ప్రస్తుతం టేలర్ వద్ద 100 మెషీన్లకు ఆర్డర్లు ఉన్నాయట.

దీంతో అతని ఆలోచనకు ఫిదా అయిన ఓ సంస్థ.. ఆ ఐడియా తమకు ఇవ్వాలని అందుకుగాను 200 కోట్లు రూపాయలు ఇస్తామని ముందుకు వచ్చింది. అయినా తన ఐడియాని ఎవరికీ ఇవ్వనని.. తన వ్యాపారాన్ని తానే ముందుకు తీసుకెళ్తానని చెబుతున్నాడు.

English summary

This kid idea cost is 200 crores