తల్లి ఎంగేజ్మెంట్ రింగ్ కొట్టేసి.. ఆ బుడతడు ఏం చేసాడో తెలిస్తే షాకౌతారు(వీడియో)

This little girl got a real diamond ring and proposal from a boy at school

12:23 PM ON 23rd November, 2016 By Mirchi Vilas

This little girl got a real diamond ring and proposal from a boy at school

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రకరకాల చర్యలు చోటుచేసుకుంటున్నాయి. ఇక రకరకాల వింతలూ విడ్డూరాలలో ఇదీ ఒకటి. బ్రిటన్ కి చెందిన ఓ స్కూలు బుడతడు తన తల్లి ఎంగేజ్మెంట్ రింగును దొంగిలించి తోటి పాపాయికి ప్రపోజ్ చేశాడు. దీనిపై ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. కడుపుబ్బ నవ్వించే ఈ వీడియోపై కామెంట్స్ కూడా బానే పడుతున్నాయి. స్కూల్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన ఆ బాలిక మెరిసిపోతున్న వజ్రాల రింగును బ్యాగులో నుంచి తీసి తల్లిదండ్రులకు చూపించింది. ఉంగరం ఎక్కడిదని ఆరా తీసిన పేరెంట్స్ కాస్తా తమ కుమార్తె మిల్లీ మాటలు విని తెల్లముఖం వేశారు.

1/4 Pages

ఆమెకు ప్రపోజ్ చేసిందెవరో చెప్పమంటూ పాప తండ్రి సరదాగా ఓ వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఎవరు మిల్లీ నీకు ప్రపోజ్ చేసింది అని అడిగితే ఆ పాప ఉత్సాహంగా టామీ అని చెప్పింది. స్కూల్ పిల్లాడు ఉంగరమిచ్చాడంటే అందరూ ఊహించినట్టుగానే బొమ్మ ఉంగరమిచ్చి ఉంటాడని తాము ఊహించామని బాలిక తండ్రి పేర్కొన్నాడు.

English summary

This little girl got a real diamond ring and proposal from a boy at school