అది మెడా ... బొంగరమా(వీడియో)

This Man Can Rotate His Head 180 Degrees

11:31 AM ON 23rd January, 2017 By Mirchi Vilas

This Man Can Rotate His Head 180 Degrees

కొన్ని కటౌట్స్ చూసి నమ్మేయ్యాలి గురూ అనే డైలాగ్ కాదిది. ఎందుకంటే కొన్ని విషయాలను చూసి ఆనందించాలి కానీ, ఆచరించాలని ప్రయత్నించకూడదు. నిపుణుల పర్యవేక్షణలో సమగ్ర శిక్షణ పొందినవారే చేయగలిగే పనులు ఉంటాయి. ఈ సాహస కృత్యం కూడా అలాంటిదే. దీనిని ఇష్టానుసారం ఆచరించేందుకు ప్రయత్నించకూడదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయిన ఓ వీడియో ఒళ్ళుగగుర్పొడుస్తుంది.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే, ఓ యువకుడు తన మెడను ఒకేసారి 180 డిగ్రీలు తిప్పినట్లు కనిపిస్తోంది. మెడను తిప్పేటపుడు మిగతా శరీరాన్ని కదపకపోవడం విచిత్రం. కొందరు వ్యక్తుల సమక్షంలో ఈ విన్యాసాన్ని చేశాడు. అక్కడున్నవారంతా ఇతని నైపుణ్యాన్ని మెచ్చుకుని, చప్పట్లతో అభినందించారు. ఈ స్టంట్ ఎక్కడ జరిగిందో తెలియదు. ఈ వీడియోను 25 వేలకన్నా ఎక్కువగా చూశారు.

ఇవి కూడా చదవండి: షాకింగ్ న్యూస్ :బాలుడి రక్తం తాగి, గుండెను విసిరేశాడు

ఇవి కూడా చదవండి: ఇండియన్ మార్కెట్లో ఇప్పటి వరకు ఇలాంటి ఫోనే లేదట

English summary

Some people have some different specialties in them and here is the man who can rotate his head in 10 degrees angle aslo.