సాహసంలో తామేమీ తక్కువ కాదంటున్న సౌత్ హీరోయిన్(వీడియో)

Thodari movie theatrical trailer

11:23 AM ON 8th August, 2016 By Mirchi Vilas

Thodari movie theatrical trailer

మూవీల్లో హీరోలే కాదు హీరోయిన్లు కూడా సాహసాలు చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ లో రానున్న ఫిల్మ్ లో ఇలాంటి సాహసమే ఒకటుంది. ధనుష్- కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న తొడరి సినిమాను ఐదేళ్ల కిందట హాలీవుడ్ లో వచ్చిన రైలు మూవీని ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. తొడరి అంటే రైలు అని మీనింగ్. కేవలం నిమిషమున్నర ట్రైలర్ లో షూటింగ్ అంతా ట్రైన్ లో జరిగింది. గోవా-ముంబై సరిహద్దు ప్రాంతాల్లో అధికభాగం షూట్ చేశారు. ఆ లొకేషన్స్ లో హీరోయిన్ రైలు బయట వుండడం ఓ సాహసంగానే తమిళ తంబీలు వర్ణించుకుంటున్నారు. పూజాజవేరి ఓ కీలక రోల్ లో కనిపించనుంది.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ ఫిల్మ్ బాక్సాఫీస్ ని ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు యూనిట్ సభ్యులు. వీలైతే సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచనగా వుంది. ఇక కీర్తి సురేష్ తాజాగా సూర్య పక్కన కూడా ఓ మూవీ చేయబోతోంది.

English summary

Thodari movie theatrical trailer