తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Tholiprema heroine Keerthi Reddy in her cousin's marriage

01:43 PM ON 3rd June, 2016 By Mirchi Vilas

Tholiprema heroine Keerthi Reddy in her cousin's marriage

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం తొలిప్రేమ. కరుణాకరన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం అప్పట్లో ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రమే పవన్ ని స్టార్ హీరోగా నిలబెట్టింది. అంతే కాదు ఇందులో నటించిన కీర్తి రెడ్డి కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే దీని తరువాత కీర్తి రెడ్డి బాలీవుడ్ కి మఖాం మార్చడం, అక్కడ మూడు సినిమాలు వరుసగా చెయ్యడం జరిగిపోయింది. అయితే ఈమె చివరిగా నటించిన చిత్రం మాత్రం అర్జున్ చిత్రమే.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో కీర్తి రెడ్డి మహేష్ కి అక్కగా నటించింది. ఆ తరువాత అదే ఏడాదిలోనే టాలీవుడ్ హీరో సుమంత్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. సుమంత్ ని పెళ్లి చేసుకున్న తర్వాత.. వీరిద్దరూ అభిప్రాయబేధాలతో విడిపోయారు. ఆ తర్వాత ఈమె మీడియా ముందు కనిపించలేదు. అమెరికా వెళ్లి సెటిల్ అయిపోయిందని వినడమే తప్ప.. ఆమె గురించి వివరాలు ఏమీ తెలియలేదు. గతేడాది మాత్రం ఓసారి ఇండియాకి వచ్చి ఓ పెళ్లిలో సందడి చేసింది కీర్తి రెడ్డి. హీరో సామ్రాట్ ఈమెకు కజిన్ అవుతాడు.

అతని పెళ్లికి వచ్చినప్పుడే.. బాగా బొద్దుగా కనిపించింది కీర్తి రెడ్డి. అయితే.. ఈమె అమెరికాలోనే ఉంటూ అక్కడే సెటిల్ అయిన ఓ డాక్టర్ ని పెళ్లి చేసుకుందని సమాచారం. ఈ పెళ్లి జరిగి కూడా చాలా సంవత్సరాలు అయ్యింది. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే.. గ్లామర్ ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యాక మీడియా ఫోకస్ అవసరం లేదని భావించడంతో.. తన గురించి ఏ వివరాలు లీక్ కాకుండా జాగ్రత్త పడిందట కీర్తి రెడ్డి.

క్రింది స్లైడ్స్ లో కీర్తి రెడ్డి ఫొటోస్ చూడవచ్చు.

1/5 Pages

English summary

Tholiprema heroine Keerthi Reddy in her cousin's marriage