'బాబు' కుటుంబంపై ఆత్మాహుతి దాడి చేస్తాం(వీడియో)

Threat call for Chandra Babu family

05:08 PM ON 27th October, 2016 By Mirchi Vilas

Threat call for Chandra Babu family

ఆంద్ర ఒరిస్సా బోర్డర్(ఏ ఓబీ)లో చోటుచేసుకున్న భారీ ఎన్ కౌంటర్ లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ముఖ్యంగా సీనియర్ నేతలు ప్రాణాలు కోల్పోవడంతో మావోలు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు తేనె పూసిన కత్తి అని, విశాఖ మారణకాండ ఫలితాన్ని త్వరలోనే అనుభవిస్తాడు అని మావోయిస్టు పార్టీ ఏపీ కమిటీ అధికార ప్రతినిధి శ్యామ్ అన్నారు. లోకేష్, చంద్రబాబు తమ నుంచి తప్పించుకోలేరని, అవసరమైతే చంద్రబాబు కుటుంబంపై ఆత్మాహుతి దాడి చేస్తామమని, ఎల్లకాలం పోలీసులు.. మిలట్రీ కాపాడలేరని మావోయిస్టులు పేర్కొన్నారు. మోడీ, చంద్రబాబు కుట్ర ఫలితమే హత్యాకాండ అని, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తామని వారు చెప్పారు.

కోవర్టు ద్వారా అన్నంలో విషం కలిపి పడిపోయిన మావోయిస్టులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని మావోయిస్టు పార్టీ ఏపీ కమిటీ అధికార ప్రతినిధి శ్యామ్ ఆరోపించారు. తుఫానుల్లో ఇది పెద్దదని, నాలుగు రోజుల్లో తట్టుకుని నిలబడతామని ఆయన అన్నారు. పోలీసుల ఆధీనంలో ఉన్న మావోయిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులను దేశద్రోహులుగా చిత్రీకరించి, విదేశీయులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారన్నారు. అవార్డులు, రివార్డుల కోసం పోలీసులు, మిలట్రీ కిరాయి హత్యలకు పాల్పడుతోందన్నారు. కోట్లు సంపాదించిన ఎమ్మెల్యేలు, ఎంపీలను కన్నెత్తి చూడడం లేదని, ప్రజాస్వామ్యం పేరుతో హత్యలు చేస్తూ, ఎన్ కౌంటర్ అంటున్నారని, అడవులు, కొండల్ని పాలకులు దోచుకుంటున్నారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు.

2003 అక్టోబర్ 1న తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న చంద్రబాబుపై అలిపిరి వద్ద మందు పాతర దాడి జరిగి తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే ఆ కేసుకు సంబంధించిన దోషులకు శిక్ష కూడా పడిన సంగతి తెల్సిందే.

English summary

Threat call for Chandra Babu family