దర్శకేంద్రుడి నుంచి అతడికి ప్రాణహాని!

Threat for his son from RaghavendraRao

11:26 AM ON 15th June, 2016 By Mirchi Vilas

Threat for his son from RaghavendraRao

అవునా అంటే అవునని ఓ వ్యక్తి తల్లిదండ్రులు అంటున్నారట. ఇంతకీ ఈ విషయంలోకి వెళ్తే.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నుంచి తమ కొడుక్కి ప్రాణహాని ఉందంటూ... రవీంద్ర అనే యువకుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. రవీంద్ర అంటే ఇంకెవరో కాదు... మొన్నీ మధ్య రాఘవేంద్రరావు ఇంటి పై దాడి చేసి మూడు కార్లను ధ్వంసం చేసిన యువకుడే. అతడిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఎద్దులవాండ్లపల్లి గ్రామానికి చెందిన రవీంద్ర తల్లిదండ్రులు మాట్లాడుతూ... తమ కొడుకు శ్రీరామదాసు కథను రాసి పంపించాడని... అతను మెచ్చుకుని రూ.15 లక్షలు ఇస్తానని చెప్పి రమ్మన్నారని తెలిపారు.

డబ్బు ఇవ్వకుండా ఏళ్లకు ఏళ్లు తిప్పుకున్నారని.. ఈ నెల 9న కూడా అతను రమ్మంటేనే తన కొడుకు హైదరాబాద్ వెళ్ళాడని వారు చెప్పారు. తీరా వచ్చాక ఎవరో తెలియనట్టు వ్యవహరించాడని... అందుకు సహనం కోల్పోయి తమ కొడుకు దాడి చేశాడని అన్నారు. తన కొడుకుకి ప్రాణహాని వుందని పేర్కొన్నారు. రక్షణ కల్పించి తనకు న్యాయం చేయాలని కోరారు.

English summary

Threat for his son from RaghavendraRao