ప్రధాని మోడీకి పొంచి ఉన్న ముప్పు... షాకింగ్ న్యూస్!

Threat for Narendra Modi

12:19 PM ON 29th July, 2016 By Mirchi Vilas

Threat for Narendra Modi

ప్రపంచంలో అక్కడా ఇక్కడా అనే తేడాలేకుండా అన్నింటా వణికిస్తున్న టెర్రరిజం, ఉగ్రవాదం ఇప్పుడు భారత దేశానికి హాని తలపెట్టడానికి సిద్ధమవుతున్నాయా? ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే వినిపిస్తోంది. మోడీ జాగ్రత్తగా వ్యవహరించాలని భారతీయ నిఘా సంస్థలు, ప్రత్యేక రక్షక బృందాలు ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నాయి. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్ధేశించి ప్రధాని మోడీ ప్రసంగించేందుకు బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ఉపయోగించాలని సూచిస్తున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో భద్రతాధికారులు ప్రత్యేకంగా సమావేశమై ప్రధాని మోడీ భద్రత గురించి చర్చించినట్లు చెబుతున్నారు.

ఈసారి మోదీకి ప్రాణ హాని అవకాశం అత్యధికంగా ఉందని భద్రతాధికారులు స్పష్టంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. తమ హెచ్చరికలను ప్రధాన మంత్రి తప్పనిసరిగా పాటించాలని భద్రతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రధాన మంత్రి భద్రతాకాన్వాయ్ లోకి డ్రోన్ లతో దాడులు చేసే అవకాశం ఉన్నట్లు నిఘా అధికారులు హెచ్చరించారు. కాశ్మీరు అల్లర్లు, సరిహద్దుల ఆవలి నుంచి చొరబాట్లు, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రపంచవ్యాప్తంగా దాడులు చేస్తుండటం వంటి కారణాలు కూడా మోడీకి భారీ భద్రత కల్పించాల్సిన అవసరాన్ని చాటి చెబుతున్నాయని అంటున్నారు. ఈ విషయాల గురించి, ఎస్పీజీ, యాంటీ టెర్రర్ యూనిట్లకు కొద్ది వారాల క్రితం కేంద్ర నిఘా సంస్థలు విశ్వసనీయ సమాచారాన్ని పంపించినట్లు చెప్పుకుంటున్నారు.

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా భీకర దాడులు జరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా ఒకే ఉగ్రవాది వచ్చి భయానక దాడులకు పాల్పడే సంఘటనలు జరగవచ్చునని హెచ్చరించినట్లు తెలుస్తోంది. భారత సైన్యాన్ని, పోలీసులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడేందుకు అల్ ఖైదా, ఐఎస్ఐఎస్ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విషయాలను అన్ని భద్రతా సంస్థలకు చేరవేశారు. ఇక 2014లో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోడీ ఎర్రకోటపై నుంచి జాతినుద్ధేశించి ఇప్పటి వరకు చేసిన ప్రసంగాలకు బుల్లెట్ ప్రూఫ్ ఎన్ క్లోజర్ ను ఉపయోగించలేదు. అయితే ఈసారి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించే విదంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎర్రకోట పరిసరాల్లో భద్రత కల్పించేందుకు 5000 మంది ఎస్ పీజీ, ఐబీ, పారామిలిటరీ దళాలు, ఢిల్లీ పోలీసు సిబ్బందిని మోహరిస్తారు. డ్రోన్ ల రాకపోకలపై గగనతలం నుంచి నిఘా పెట్టాలని భావిస్తున్నారు.

English summary

Threat for Narendra Modi