చిన్నారి కడుపులో మోయలేని భారం ...

Three And Half Kilo tumor in 15 Months old baby stomach

11:14 AM ON 10th August, 2016 By Mirchi Vilas

Three And Half Kilo tumor in 15 Months old baby stomach

ఈ లోకంలో అనేక వింతలూ విడ్డూరాలు సహజం ...కానీ ఈ వింత ఓ చిన్నారిని నరకయాతన పెట్టింది. మొత్తానికి విషయం గుర్తించి, చర్యలు చేపట్టడంతో ఉపశమనం కలిగింది. వివరాల్లోకి వెళ్తే, ఆ పాప కు 15 నెలల వయస్సు. ఈ చిన్నారి నిషా పొట్ట అంతకంతకూ పెరిగిపోతూ... ఏమీ తినలేక, తాగలేక కొన్ని వారాలుగా నరక యాతన అనుభవించిం దంటే చెప్పనలవి కాదట. ఎందుకంటే, ఒక్క క్షణమైనా కంటిమీద కునుకు లేకుండా ఏడుస్తూనే ఉండేది. బిడ్డ బాధను చూడలేక తల్లిదండ్రులు సుమతి, రాజులు ఆమెను తమిళనాడులోని శ్రీగణపతి కృష్ణా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాప కడుపులో కణితి ఉండొచ్చని భావించిన వైద్యులు... అసలు విషయం తెలిసి నిర్ఘాంతపోయారు! ఆమె కడుపులో పెరుగుతున్నది పిండం అని తేలింది. జుట్టు, ఎముకలు, మాంసం కలిసి 3.5 కిలోల వరకు ముద్దగా పెరుగుతున్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసి దానిని తొలగించారు. ప్రస్తుతం నిషా కోలుకుంటోంది.

ఇవి కూడా చదవండి:భారతీయ జంటకు హనీమూన్ ఆనందం పంచిన సుష్మా!

ఇవి కూడా చదవండి:వంశీ పైడిపల్లితో సూపర్ స్టార్

English summary

A Baby Named Nisha with an age of 15 months was struggling with 3.5 kilo tumor on her stomach and Tamilnadu Sri Ganapathi hospital doctors did operation to that baby and removed the tumor on her stomach.