వైద్య శాస్త్రంలో అద్భుతం - చని పోయిన బిడ్డ బతికాడు

Three Days Old Baby Reborn In Nanded

10:17 AM ON 4th May, 2016 By Mirchi Vilas

Three Days Old Baby Reborn In Nanded

ఈ సృష్టిలో అనేక వింతలూ, అద్భుతాలూ సహజం...ఊహించని సంఘటనలు అబ్బుర పరుస్తాయి ... అలుముకున్న విషాదాన్ని దూరం చేసి , సంతోషం నింపుతాయి. ఇది కూడా అలాంటిదే ..పుట్టిన మూడు రోజులకే కన్నబిడ్డ దూరమవుతున్నాడని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.' చికిత్స అందించాం..అయినా లాభం లేదు" అంటూ వైద్యులు చేతులెత్తేయడంతో..ఆ చిన్నారి చనిపోయాడని భావించారు. అంతిమ యాత్రకు అన్నీ సిద్ధం చేస్తున్న సమయంలో వూహించని విధంగా ఆ శిశువులో వచ్చిన కదలిక.. అతడిని మృత్యుంజయుడిని చేసింది. ఆ తల్లి దండ్రులకు అమితానందం ఇచ్చింది. ఆశ్చర్యకర ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..

ఇవి కూడా చదవండి: పవన్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లాకు చెందిన నాగోజీరావు-భాగ్యశ్రీ దంపతులు గత కొంతకాలంగా గుజరాత్‌లోని భారుచ్‌లో నివాసముంటున్నారు. గత మార్చి 28న ఈ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు.అయితే పుట్టిన మూడు రోజులకే ఆ శిశువుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో సమీపంలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. వెంటనే డాక్టర్లు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే ఆ చిన్నారి చికిత్సకు స్పందించకపోవడంతో ఇక బతికే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌ తీయగానే చిన్నారి చనిపోతాడని చెప్పడంతో.. తల్లిదండ్రులు చేసేదేమీ లేక.. చిన్నారి పరిస్థితిని తలుచుకుని విలపించారు. ఆసుపత్రి నుంచి తీసుకొచ్చిన తమ కన్నబిడ్డ ఇక లేడని భావించి.. అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అనుకోకుండా కొద్దిసేపటికి శిశువులో కదలిక రావడాన్ని అతడి తండ్రి గుర్తించి.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దీంతో వైద్యులు చిన్నారికి చికిత్స అందించారు. సరిగ్గా నెలరోజులకు చిన్నారి పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.ఇది చాలా అరుదైన ఘటన అని.. వైద్యులు పేర్కొన్నారు. ఈ వార్త ఆనోటా,ఈ నోటా అందరికీ తెలియడంతో ఆశ్చర్యపోవడం వారి వంతు అయింది.

ఇవి కూడా చదవండి: ఎక్కువసార్లు పెళ్ళి చేసుకున్న నటులు

ఇవి కూడా చదవండి:మా చుట్టాలు వెళ్ళడం లేదంటూ పోలీస్ కేసు పెట్టాడు

English summary

A Couple Named Nagoji Rao ad Bhagya Sri were gave birth to a baby Boy in Government Hospital in Nanded District in Maharashtra.After Three Days But due to Respiration Problems to that baby doctors said that the baby wont be alive.But that three year old baby was moved a bit and the baby father taken him to hospital and the baby was recovered with a Good Health after a Month.