వెల్త్ ఎక్స్ సంపన్నుల జాబితాలో ముగ్గురు ఇండియన్స్

Three Indians In Wealth-X List

10:45 AM ON 29th January, 2016 By Mirchi Vilas

Three Indians In Wealth-X List

ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలోని తొలి 50 స్థానాల్లో ముగ్గురు భారతీయులకు చోటు దక్కింది. భారత పారిశ్రామికవేత్తలు ముఖేష్‌ అంబానీ, అజీమ్‌ ప్రేమ్‌జీ, దిలీప్‌ సంఘ్వీలకు ఈ జాబితాలో స్థానం లభించింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ 87.4 బిలియన్‌ డాలర్లుతో ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. వెల్త్‌-ఎక్స్‌, బిజినెస్‌ ఇన్‌ సైడర్‌ సంయుక్తంగా రూపొందించిన ఈ జాబితాను గురువారం వెల్లడించారు. ఈ జాబితాలో ప్రముఖ వ్యాపార వేత్త ముఖేశ్‌ అంబానీ 24.8 బిలియన్‌ డాలర్లతో 27వ స్థానంలో నిలిచారు. విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ 16.5 బిలియన్‌ డాలర్లుతో 43వ స్థానం, సన్‌ ఫార్మాసిటికల్‌ వ్యవస్థాపకుడు దిలీప్‌ సంఘ్వీ 16.4 బిలియన్‌ డాలర్లుతో 44వ స్థానంలో ఉన్నారు. స్పానిష్‌ వ్యాపారవేత్త అమానికో ఓర్టెగా గవోనా 66.8 బిలియన్‌ డాలర్లు, వారెన్‌ బఫెట్‌ 60.7 బిలియన్‌ డాలర్లతో రెండు మూడు స్థానాల్లో నిలిచారు. అమెజాన్‌ జెఫ్రె- 56.6 బిలియన్‌ డాలర్లు, యూఎస్‌ వ్యాపారవేత్త డేవిడ్‌ కోచ్‌- 47.4 బిలియన్‌ డాలర్లతో నాలుగు, ఐదు స్థానాలు దక్కించుకున్నారు. కొత్త జాబితా ప్రకారం యునైటెడ్‌ స్టేట్స్‌లో 29 మంది బిలియనీర్లు ఉండగా.. చైనా నుంచి నలుగురు బిలియన్లు.. భారతదేశం నుంచి ముగ్గురు బిలియనీర్లు టాప్‌ 50 స్థానాల్లో ఉన్నారు.

English summary

Reliance Chairman Mukesh Ambani,Wipro's Azim Premji,Sun's Dilip Shangvi has got place in the top 50 richest people list released by Wealth-X