అక్కడ ‘స్టార్‌’ వార్!

Three Movie Actors Contesting From Same Constituency In Kerala

11:18 AM ON 30th April, 2016 By Mirchi Vilas

Three Movie Actors Contesting From Same Constituency In Kerala

అవును, రాజకీయాలన్నాక ఎత్తులు పై ఎత్తులు సహజం కదా... అందుకే ఓ నియోజకవర్గంలో అందరూ నటులే బరిలో దిగారు. ఇంకా చెప్పాలంటే, రాజకీయ పార్టీలు అలా దింపాయి.ఇక అక్కడ స్టార్ వార్ నడుస్తోంది.కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పఠానపురం నియోజకవర్గం నుంచి ముగ్గురు సినీ నటులు పోటీ పడుతున్నారు. దాంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మే 16న ఎన్నికలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి:ఆ ఇంట 100 ఏళ్ళ తర్వాత పాపాయి పుట్టింది!

ఈ నియోజకవర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యే గా వున్న కె.బి.గణేశ్‌ కుమార్‌ మలయాళం సినిమాల్లో హీరో, క్యారెక్టర్‌ పాత్రలు పోషించారు. మూడు సార్లు యూడీఎఫ్‌ నుంచి గెలుపొందగా.. ప్రస్తుతం ఎల్‌డీఎఫ్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రముఖ హాస్యనటుడు జగదీశ్‌ యూడీఎఫ్‌ నుంచి, విలన్‌ పాత్రలు పోషించే రఘు దామోదరన్‌ అలియాస్‌ భీమన్‌ రఘు భాజపా నుంచి పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు సినీ నటులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రఘు, జగదీశ్‌ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. మొత్తానికి ఆసక్తికరంగా మారిన స్టార్ వార్ లో గెలుపు ఎవరిని వరిస్తుందో ... ఇక బెట్టింగ్ లు కూడా బానే ఉండేలా వుంది.

ఇవి కూడా చదవండి:దాని కోసం భార్యని సుత్తితో కొట్టి చంపేసాడు!

ఇవి కూడా చదవండి:ఐస్ క్రీం వల్ల పెళ్లి ఆగిపోయింది

English summary

Kerala Elections Campaign was going well in the State and Three Malayalam film actors named Ganesh ,Jagadeesh , Raghu were Competeting from same assembly Constitution in Kerala.