టిటిడి పై ముగ్గురు ఎంపిల కన్ను

Three MPs Competiting for TTD Chairman Post

09:38 AM ON 30th April, 2016 By Mirchi Vilas

Three MPs Competiting for TTD Chairman Post

అబ్బో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పై ఏకంగా ముగ్గురు ఎంపిల కన్ను పడింది. ఇందులో అధికార టిడిపి ఎంపి లతో పాటూ ఓ బిజెపి ఎంపి కూడా ఉన్నారట. వాస్తవానికి టిడిపి అధికారంలోకి వచ్చాక టీటీడీ చైర్మన్ గా తిరుపతికి చెందిన చదలవాడ కృష్ణమూర్తితోపాటు మొత్తం 18 మంది సభ్యులతో కూడిన ధర్మకర్తల మండలిని ప్రభుత్వం నియమించింది. దీంతో గత ఏడాది మే 1వ తేదీన చైర్మన్ తోపాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది పాటు ధర్మకర్తల మండలి పదవిలో కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మండలి పదవీ కాలం బుధవారంతో ముగిసింది. అయితే ప్రమాణం స్వీకారం చేసింది మే 1న అయినందున ఈ ఏడాది మే 1 వరకు వీరు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అప్పుడే లాబీయింగ్ మొదలైంది. ప్రస్తుత పాలకవర్గం కొనసాగుతుందా? కొత్త పాలక వర్గం వస్తుందా? నిబంధనల ప్రకారం పాలక వర్గ సమయం ముగిసినా ప్రభుత్వం ఎందుకు ఇంకా పాలకవర్గాన్ని కొనసాగిస్తోంది? దీనికి ప్రత్యేక కారణమేమైనా ఉందా? వంటి ప్రశ్నలు వినిపిస్తుండగా, మరోపక్క టీటీడీ చైర్మన్ పదవి ఆశిస్తున్న నేతలు సీఎంపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. ఇక ప్రస్తుత చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని ధర్మకర్తల మండలినే మరో యేడాది పాటు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి:
ఎందుకంటే , ఇప్పటికే స్థానిక ఆలయాల కమిటీలకు పాలకవర్గాన్ని రెండేళ్లు పొడిగించారు. ఆ నిర్ణయాన్నే టీటీడీకి కూడా వర్తింపజేయాలని నిర్ణయించినట్టు చెప్పుకొస్తున్నారు. అయితే అదే కనుక జరిగితే కొద్ది పాటి మార్పులు చేర్పులతో ప్రస్తుత పాలకవర్గం కొనసాగడం ఖాయం. ఎందుకంటే, టీటీడీ బోర్డు సభ్యుల్లోని తెలంగాణకు చెందిన సాయన్న ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరిపోయారు. అలాగే ఒకరిద్దరి మార్పుపైనా సీఎం యోచన చేస్తున్నారట. కాగా టీటీడీ చైర్మన్ పదవి రేసులో ఉన్న సినీనటుడు - రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ తాజాగా సీఎం చంద్రబాబును కలిశారని ప్రచారం జరుగుతోంది. ఇక నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. ఎందుకంటే టీటీడీ చైర్మన్ తన జీవితకాల కోరిక అని అందుకోసమే టీడీపీలో చేరానని అప్పట్లో తనకు టీటీడీ చైర్మన్ పదవిపై బాబు హామీ ఇచ్చారని కూడా తన సన్నిహితుల వద్ద రాయపాటి చెప్పుకొస్తున్నారు. గతంలోనే ఆయన గట్టిగా ప్రయత్నాలు చేసారు. కానీ ఈసారి తనకే వస్తుందన్న ఆశతో వున్నారు.

ఇవి కూడా చదవండి:

ఇక మిత్ర పక్షమైన బీజేపీ తరపున నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు కూడా టిటిడి చైర్మన్ గిరీపై ఆశలు పెట్టుకున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్టు బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. ఎందుకంటే గతంలో చైర్మన్ గా పనిచేసిన మాజీ ఎంపి కనుమూరి బాపిరాజు కి ఈయన బంధువే. కొత్త బోర్డుపై చర్చ జోరుగా సాగుతోన్న నేపథ్యంలో మే రెండో తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. మరోవైపు చదలవాడ మాత్రం మరో రేండేళ్లపాటు ఈ పదవిని పొడిగించాలని సీఎంను కోరుతున్నారట. మరి చంద్రబాబు మనసులో ఏముందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

English summary

Sri Tirumala Tirupathi Devasthanam(TTD) chairman to relieve and MP's like Muriali Mohan,Kanuri Sambha Shiva Rao and few others were asking Chandra Babu Naidu for TTD Chairman Post.