కొత్తగా మూడు అర్బన్ డవలప్ మెంట్ అధారిటీలు - విశాఖకు  అప్ గ్రేడ్ 

Three New Urban Development Authorities In Andhra Pradesh

11:11 AM ON 30th November, 2015 By Mirchi Vilas

Three New Urban Development Authorities In Andhra Pradesh

రాష్ట్రంలో కొత్తగా మూడు అర్బన్ డవలప్మెంట్ అధారిటీలు ఏర్పడబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. అనంతపురం - హిందూపురం లను కలిపి ఒకటి , కర్నూల్ - నెల్లూరులను కలిపి మరొకటి , రాజమండ్రి - కాకినాడ లను కలిపి ఇంకొకటి డవలప్ మెంట్ అధారిటీలు గా ఏర్పడబోతున్నాయి. ఇప్పటికే డవలప్మెంట్ అధారిటీ గా వున్న విశాఖకు మెట్రో డవలప్మెంట్ అధారిటీ హోదా రాబోతోంది. ఎపి కేబినేట్ సమావేశం ప్రస్తుతం విజయవాడలో భేటీ అవడంతో డవలప్మెంట్ అధారిటీల గురించి , చర్చించి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. కేవలం 30రోజుల వ్యవధిలో మూడోసారి ఎపి కేబినేట్ సమావేశం జరుగుతుండడం విశేషం , ఈ సమావేశం 5గంటలపాటు జరిగే అవకాశం వుందని అంటున్నారు. ఇసుక , బాక్సైట్ ల గురించి ఇప్పటికే సిఎమ్ చంద్రబాబు శ్వేత పత్రాలు విడుదల చేయడంతో వీటి గురించి మంత్రివర్గం చర్చించనుంది. ఎపి రాజధాని, ఉద్యోగుల తరలింపు తదితర కీలక అంశాలపై చర్చించడంతో పాటూ డవలప్మెంట్ అధారిటీల గురించి నిర్ణయం తీసుకునే అవకాశం వుంది.
ఏనాటి నుంచో గోదావరి డవలప్మెంట్ అధారిటీ డిమాండ్ వుంది. కాకినాడ తో పాటు తూర్పు గోదావరి జిల్లా లోని మున్సిపాల్టీ లను అలాగే పశ్చిమ గోదావరి లోని మరికొన్ని మున్సిపాల్టీ లను కూడా ఇందులో మిళితం చేసి గోదావరి డవలప్మెంట్ అధారిటీ ఏర్పాటుచేయాలని గతంలో ఓ ప్రతిపాదన వచ్చింది. అయితే ఇంతవరకు డవలప్మెంట్ అధారిటీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కాకినాడ - రాజమండ్రి కలిపి డవలప్మెంట్ అధారిటీ ఏర్పాటు గురించి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఇది ఎలా ఉండబోతోంది అన్నది తెలియాల్సి వుంది. రాష్ట్రంలో మూడు అర్బన్ డవలప్ మెంట్ అధారిటీలు ఏర్పడితే , వాటికి చైర్మన్ ల నియామకం వుంటుంది. ఇది తెలుగు తమ్ముళ్ళ కు శుభవార్తే. డవలప్మెంట్ అధారిటీలు ఏర్పడితే తొలి చైర్మన్ గిరీ దక్కేదెవరికో మరి.

English summary

Three New Urban Development Authorities to be in Andhrapradesh .Andhrapradesh cheif minister nara chandrababu naidu to discuss about this with the ministers of andhra pradesh and takes decision