సెల్ఫీ మోజులో ప్రాణాలు కోల్పోయారు

Three Students Died By Taking Selfie

11:06 AM ON 27th January, 2017 By Mirchi Vilas

Three Students Died By Taking Selfie

ప్రతిచేతికీ ఫోన్ అందునా స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇక ఎంతసేపు సెల్పీల మీద యావ పెరిగిపోయింది. చివరికి ఈ సెల్పీలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. మృత్యువుకు మార్గాన్ని చూపుతున్నాయి. ప్రమాదం అంచులోకి వెళ్ళినా సెల్పీ మోజులో పడి గుర్తించని దుస్థితి నెలకొంది. దీంతో సెల్పీ కోసం చనిపోతున్న ఘటనలను రోజు ప్రసార సాధనాల్లో చూస్తున్నాం. ఇదే కోవలో ఓ ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళ్తే, హైద్రాబాద్ లో తార్నాక నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న అవినాష్ ,చరణ్,భరత్, వంశీ లు గురువారం మధ్యాహ్నం ఘట్ కేసర్ సమీపంలోని సత్యపాల్ క్రషర్ మిల్ వద్ద ఉన్న నీటి గుంత వద్దకు వెళ్ళారు.

అవినాష్, చరణ్ లు సెల్పీ తీసుకొంటుండగా కాలు జారి ప్రమాదవశాత్తు ఇద్దరూ కూడ నీటి గుంటలో పడ్డారు. వీరిని మిగిలిన మిత్రులు రక్షించే ప్రయత్నం చేస్తుండగానే ఊపిరాడక చనిపోయారు. ఈ సమాచారం తెలుసుకొన్న మృతుల కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘట్ కేసర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వెన్ని జరిగినా జనంలో మార్పు వస్తుందా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: ఐఫోన్ ఉంటే నెట్ అవసరం లేదట

ఇవి కూడా చదవండి:ఈ నాణేలు రద్దు అవుతాయా ?

English summary

Selfie craze was going hardly in recent days and so many people were taking selfies and many of them were died by taking selfies recently three intermediate students in Hyderabad were died by taking selfies.