ఒకేసారి ముగ్గురు సూపర్‌ స్టార్స్‌!

Three Superheroes In Captain America Movie

11:17 AM ON 15th March, 2016 By Mirchi Vilas

Three Superheroes In Captain America Movie

ఒకేసారి ఏకంగా ముగ్గురు సూపర్‌ స్టార్స్ ని చూసే అరుదైన అవకాశం ఇది ... వాళ్ళెవరంటే హాలీవుడ్ సూపర్ హీరోలు కెప్టెన్‌ అమెరికా, ఐరన్‌మ్యాన్‌, స్పైడర్‌మ్యాన్‌... వీళ్ళు ముగ్గుర్నీ ఒకేసారి తెరమీద చూసే అవకాశం ప్రేక్షకులకు త్వరలోనే లభిస్తోందట! ‘కెప్టెన్‌ అమెరికా: సివిల్‌ వార్‌’ చిత్రం ట్రయిలర్‌ విడుదలైన తరువాత ఈ కొత్త వార్త సంచలనం సృష్టిస్తోంది. అమెరికా రాజకీయ, సామాజిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయి, ప్రజలు అంతా భీతావహులై నానా అవస్థలు పడుతున్న రోజులను తలపించే విధంగా వుండే కథగా రూపొందుతున్న ఈ చిత్రంలో భవనాలు కూలిపోతుంటాయి; జీవితాలు నుసి అయిపోతుంటాయి; ఎన్నెన్నో కొత్త వింత భయాలు చుట్టుముడుతుంటాయి. ఈ పరిస్థితిలో అమెరికాను సంరక్షించేందుకు సూపర్‌హీరోలు నడుం కడతారు. ఈ కథలో కొత్తగా స్పైడర్‌మ్యాన్‌ చేరాడన్నదే విశేషం. ‘కెప్టెన్‌ అమెరికా’గా క్రిస్‌ ఇవాన్స్‌, ‘ఐరన్‌మ్యాన్‌’గా రాబర్ట్‌డౌనీ జూనియర్‌లు నటిస్తుండగా, ‘స్పైడర్‌మ్యాన్‌’గా టామ్‌ హాలెండ్‌ నటిస్తున్నాడు. ఇది వరకు ‘ది ఏమేజింగ్‌ స్పైడర్‌మ్యాన్‌’ సిరిస్‌లో ‘స్పైడర్‌మ్యాన్‌’గా యాండ్రూ గార్‌ఫీల్డ్‌ నటించేవారు. కానీ, ఆ సిరీస్‌ తర్వాత ఆ పాత్ర టామ్‌ హాలెండ్‌ వశమైంది. వీళ్లంతా కలిసి అమెరికాలో చోటు చేసుకుంటున్న బీభత్స ఘట్టాలను ఎలా ఎదుర్కొన్నారనేది తెరమీద చూడాల్సిందే. ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు తీసుకొచ్చింది.

English summary

Three Super Heros of Hollywood to be appeared in on Movie.Recently the trailer of Captain America : Civil War movie trailer was released and in that Spider man also appears in that movie. Now this was trending over the internet and this trailer raises expectations on the movie.