దేశంలోనే తొలి సెల్ఫీ అరెస్టు!

Three teens arrested for halting train to take selfies

10:13 AM ON 28th May, 2016 By Mirchi Vilas

Three teens arrested for halting train to take selfies

ఇదేమిటి అనుకుంటున్నారా? అవును మరి కొందరి సెల్ఫీల చేష్టలు శృతి మించి రాగాన పడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ లు అందరి చేతుల్లోకి వచ్చేయడం, అలా ఫోటో దిగి ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేయడం చేసేస్తున్నారు. కానీ సెల్ఫీ లు దారి తప్పుతున్నారు. డ్రైవింగ్ చేస్తూ , ఇలా రకరకాల సాహసాలు చేస్తున్నారు. కానీ ఈ పిల్లలు ఏకంగా యమ స్పీడుతో వచ్చే రైలు దగ్గర సెల్ఫీ దిగారు. ఈ కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో అరెస్టు అయ్యారు. వివరాల్లోకి వెళ్తే, యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటు చేసుకుందీ ఘటన! వారంతా 13-16 ఏళ్ల పిల్లలే. యమా స్పీడుతో రైలు వస్తుండగా అత్యంత ప్రమాదకర స్థితిలో ఎన్నోసార్లు సెల్ఫీలు దిగారు కూడా. కానీ, పట్నా-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ ఎదుట సెల్ఫీ దిగాలనే పిచ్చి కోరికతో తుండ్లా-ఎట్మద్పూర్ వద్ద పెద్దపెద్ద రాళ్లు, చెట్టుకొమ్మలు వేసి ట్రాక్ను బ్లాక్ చేశారు. అదృష్టవశాత్తు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ఎమెర్జెన్సీ బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. ఆర్పీఎఫ్ సిబ్బందికివారు టీనేజర్లను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెల్ఫీ పిచ్చి ఆ టీనేజర్లను ఇలా కటకటాల పాల్జేసింది. బహుశా దేశంలోనే మొట్టమొదటి సెల్ఫీ అరెస్టు ఇదే కాబోలు!

ఇవి కూడా చదవండి:గొంతు నులిమి భర్తను చంపేసింది.. ఆ పై నగదుతో పరార్

ఇవి కూడా చదవండి:రైల్వే లో సౌలభ్యం గల కొత్త నిబంధనలు

English summary

These days Smart Phone become common in every ones life and selfie craze going viral in the youth. Three teenagers in Uttar Pradesh was tried to block Rajadhani express train and tried to block it by using big rocks and big tree branches. The loco pilot of the train was complained to CRPF police and they were arrested these teengers.