బోరుబావిలో పడిన మూడేళ్ళ చిన్నారి

Three Year Old Boy Fell In Bore Well

03:12 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Three  Year Old Boy Fell In Bore Well

బోరుబావులు చిన్నారుల ప్రాణాలను లేత వయసులోనే మింగేస్తున్నాయి. అన్యం పుణ్యం ఎరుగని చిన్నారులు బోరుబావికి బలైపోతున్నారు,ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా కనువిప్పు రావడంలేదు. తాజాగా తెలంగాణాలో మెదక్‌ జిల్లా బొమ్మారెడ్డి గూడెంలో మరో సంఘటన చోటు చేసుకుంది. జనావాసాల మధ్య తవ్విన ఓ బోరుబావి దగ్గర ఆడుకుంటున్న మూడేళ్ళ బాలుడు బోరుబావిలో పడ్డాడు. ఈ ప్రమాదాన్ని వెంటనే గమనించిన బాలుడి తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో బాలుడిని బయటకు తీసే పనిలో పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటాన సహాయక చర్యలు ప్రారంభించారు.

English summary

A Three old boy fell in bore well while playing in bommareddy gudem,medak district,Telangana