ఏంటి 'తుమ్మల' అలా కోరుకున్నారా ?

Thummala Nageswara Rao and Harish Rao visits Tirumala

12:31 PM ON 20th June, 2016 By Mirchi Vilas

Thummala Nageswara Rao and Harish Rao visits Tirumala

తెలంగాణ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు.. హరీశ్ రావు తిరుమలకు చేరుకుని ఆదివారం స్వామిని దర్శించుకున్నారు. హరీశ్ రావు ఫ్యామిలీతో స్వామివారిని దర్శనం చేసుకుంటే.. తుమ్మల మాత్రం ఫ్యామిలీ లేకుండా ఒక్కరే వచ్చారు. సంప్రదాయ వస్త్రధారణతో స్వామిని దర్శించుకున్న తర్వాత హరీశ్ ఫ్యామిలీ మెంబర్లతో ఫోటోలకు ఫోజులు ఇచ్చేయగా.. మంత్రి తుమ్మల మాత్రం ముక్త సరిగా సరిపెట్టారు.

ఏపీ సర్కారు మీదా అప్పుడప్పుడు విమర్శలు చేసే తుమ్మల నోటి నుంచి ఎలాంటి వ్యాఖ్యలు వస్తాయన్న ఆసక్తితో చాలామంది ఎదురుచూసారు. స్వామి వారిని ఏం కోరుకొని ఉంటారన్న ఉత్సాహం చూపించిన వారికి తగ్గట్లే తెలంగాణ రాష్ట్రంలో కీలక బాధ్యతలు మోస్తున్న తుమ్మల మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లో ఈ సారి మంచిగా వానలు పడాలని.. రెండు రాష్ట్రాలు చక్కగా ఉండాలని.. నీళ్లతో కళకళలాడాలని కోరుకున్నట్లుగా వ్యాఖ్యానించారు.

మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా.. స్వామిని కలిసినప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పాటు.. ఏపీ రాష్ట్రం చక్కగా ఉండాలని.. రెండు రాష్ట్రాల్లోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లుగా తుమ్మల చెప్పారు సరే. మరి ఆ దిశగా.. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంశాల వారీగా ఇచ్చుపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తే నిజంగానే ప్రజలంతా సంతోషంగా ఉంటారు కదా. నేతల చేతుల్లో ఉన్న విషయానికి కూడా స్వామి వారిని ప్రత్యేకంగా కోరుకోవాల్సిన అవసరం ఉందా..? అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.

ఇది కూడా చూడండి: పవన్ ఎస్.జె. సూర్యను తీసేసి డాలీని ఎందుకు పెట్టుకున్నట్టు?

ఇది కూడా చూడండి: కెమెరా ను కసి తీరా నమిలేసింది

ఇది కూడా చూడండి: బడిలోనూ దోపిడీయేనా? (వీడియో)

English summary

Thummala Nageswara Rao and Harish Rao visits Tirumala.