రూపాయికే టిఫిన్.. 5 రూపాయలకే భోజనం

Tiffin is for 1 rupee and lunch for 5 rupees

12:26 PM ON 25th June, 2016 By Mirchi Vilas

Tiffin is for 1 rupee and lunch for 5 rupees

తమిళనాడు కొన్ని విషయాల్లో మనకు ఆదర్శం అవుతోంది. అక్కడ సీఎం జయలలిత అమ్మా కేంటీన్లు పెట్టి అతి తక్కువ ధరకు భోజనం, టిఫిన్ అందించడం మంచి ఫలితం ఇచ్చింది. దీంతో గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న కేంటీన్లు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆచరణలో పెట్టారు. నూతన రాజధాని అమరావతిలో అన్న క్యాంటీన్‌ ను శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అన్న క్యాంటీన్లలో అల్పాహారం ఒక రూపాయి, భోజనం ఐదు రూపాయలకు లభిస్తాయి. క్యాంటీన్లలో ఉదయ 7గంటల నుంచి 10గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్న 12 గంటల నుంచి 2 గంటల వరకు భోజనం ఇక్కడ దొరుకుతాయి.

అల్పాహార మెనూలో ఇడ్లీ, ఉప్మా, పొంగల్..... మధ్యాహ్న భోజనం మెనూలో పెరగన్నం, పులిహోర, సాంబారు అన్నం.... రాత్రి భోజనం మెనూలో 2 చపాతి, శాఖాహార కూర లభిస్తాయి. ప్రతీ రోజూ 500 మందికి అల్పాహారం, భోజనం అందేలా చర్యలు చేపడుతున్నారు.

English summary

Tiffin is for 1 rupee and lunch for 5 rupees