షికారు కెళ్తూ అలిగింది - పులి నోట చిక్కింది .. ఆపై ఏమైంది (వీడియో)

Tiger Attacks And Kills Woman

11:30 AM ON 26th July, 2016 By Mirchi Vilas

Tiger Attacks And Kills Woman

భార్యాభర్తలు సరదాగా షికారుకెళ్ళి కూడా గొడవ పడితే, భార్య ప్రాణాలు పోయాయి. .షికారు కెళుతుండగా, మధ్య చిన్న తగాదాచోటు చేసుకుంది. దీంతో అలిగిన భార్య మధ్యలో కారు ఆపేసి కిందికి దిగింది. వెంటనే అక్కడున్న పులి ఆమెను నోట కరుచుకుపోయి ప్రాణాలు తీ సేసింది. ఈ సంఘటన చైనాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... చైనా రాజధాని బీజింగ్ సమీపంలోని బడాలింగ్ వైల్డ్ లైఫ్ వరల్డ్ లో ఈ ఘటన జరిగినట్టు చైనా న్యూస్ డాట్ కామ్ వెల్లడించింది. పార్కుకి ఓ జంట కారులో బయలుదేరింది.

అయితే జర్నీ సమయంలోనే భార్యాభర్తల మధ్య చిన్నగొడవ చోటు చేసుకోవడంతో భార్య కారు దిగిపోయింది. ఇంతలో వెనుకనుంచి వచ్చిన పెద్దపులి ఆమెను లాక్కెళ్లి చంపేసింది. బీజింగ్ సమీపంలోని కారులో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ఉండగా, వారు కారు దిగి సాయం చేసేందుకు ప్రయత్నించేలోగా మరో పులి కూడా దాడి చేసి ఆమెను చంపేసినట్టు తెలుస్తోంది. కారులో ఉన్న మరో యువతికి గాయాలయ్యాయి.

పులి దాడి ఘటన దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. పెద్దపులులు స్వేచ్ఛగా తిరిగే ఈ పార్కులో విజిటర్లు కేవలం కార్లలో మాత్రమే తిరగాలి తప్పఎవరూ కిందకు దిగేందుకు అనుమతి ఉండదు. పార్కులోని భద్రతాదళాలు క్షణాల్లో స్పందించి పులిని వెంటాడినప్పటికీ యువతి ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. పార్కును తాత్కాలికంగా మూసివేస్తున్నామని అధికారులు ప్రకటించారు. మొత్తానికి ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

ఇది కూడా చూడండి: ఈ వస్తువులు మీ పర్స్ లో ఉంటే ఇక అంతా అదృష్టమే!

ఇది కూడా చూడండి: సింగర్ సునీత గురించి నమ్మలేని నిజాలు

ఇది కూడా చూడండి: శరీరంలో తగినంత నీరు లేదని చెప్పే సూచనలు

English summary

Big Tiger Attacks And Kills Woman At China safari Park.