నైనిటాల్ హోటల్లో చిరుత కలకలం (వీడియో )

Tiger Entered In Nainital Hotel

12:04 PM ON 1st August, 2016 By Mirchi Vilas

Tiger Entered In Nainital Hotel

అవును, హోటల్ కి కస్టమర్లు వస్తారు గానీ చిరుతలు కూడా వస్తాయా..? కానీ వస్తాయని నైనిటాల్ లోని ఓ హోటల్ యాజమాన్యం వాళ్ళు అంటున్నారు. అందుకు ఆధారాలు వివరాల్లోకి వెళ్తే..మీరట్ నుంచి నైని టాల్ వచ్చిన సుమిత్ రాథోడ్, ఆయన భార్య శివానీ ఆదివారం అక్కడి ఓ హోటల్లో దిగారు. సుమిత్ వాష్ రూమ్ లోకి వెళ్ళబోతుండగా లోపల ఓ చిరుత కనిపించడంతో షాక్ తిన్నాడు. వెంటనే కాస్త ధైర్యం కూడదీసుకుని వాష్ రూమ్ బయటినుంచి గడియ పెట్టి కేకలు పెట్టాడు.

హోటల్ సిబ్బంది పరుగున వచ్చి తాము కూడా కిటికీ లోంచి చిరుతను చూసి కంగారెత్తిపోయారు. అటవీ సిబ్బందికి ఫోన్ చేయడంతో వాళ్ళు.. బోను, మత్తు మందుతో కూడిన గన్ తో వచ్చి హడావుడి చేశారు. అయితే సుమారు ఏడాదిన్నర వయసున్న ఆ చిరుత వాష్ రూమ్ వెంటిలేటర్ నుంచి బయటకు గెంతి దగ్గర్లోని పొదల్లో మాయమైంది. బహుశా వీధి కుక్కలు తరమడం వల్ల ఇది ఈ హోటల్లో దూరి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకుంది. దగ్గరలోని అటవీ ప్రాంతం నుంచి ఈ చిరుత వచ్చినట్టు అటవీ సిబ్బంది ధ్రువీకరించారు.

ఇది కూడా చూడండి: బ్లడ్ గ్రూప్ బట్టి మనస్తత్వం ఎలా ఉంటుంది

ఇది కూడా చూడండి: ఇంట్లో భార్యలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా?(వీడియో)

ఇది కూడా చూడండి: శ్రీహరి మృతికి అసలు కారణం చెప్పిన భార్య

English summary

Shocking News one and half year Tiger Entered In Nainital Hotel.