నేను అంత రొమాంటిక్ కాదు

Tiger Shroff About Break Up With Disha Patani

10:54 AM ON 5th May, 2016 By Mirchi Vilas

Tiger Shroff About Break Up With Disha Patani

బాలీవుడ్ లో ఒక్కొక్కరిదీ ఒక్కో తరహా ... ఇక ‘బాఘీ’ విజయంతో బాలీవుడ్‌ యువ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ ఉత్సాహంగా ఉన్నాడు అయితే, వ్యక్తిగత జీవితం ఈ కుర్రహీరోకు ఇబ్బందిగా ఉందట. తన ప్రియురాలు దిశా పటానితో బ్రేక్‌ అప్‌ అవ్వడమే ఇందుకు కారణమని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వాటిని నిజం చేస్తూ.. టైగర్‌ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. టైగర్‌ ష్రాఫ్‌.. దిశా పటానీ ప్రేమ పక్షుల్లా మొన్నటివరకు బాగానే ఉన్నారు. అయితే.. ఇటీవల వారిద్దరి మధ్య దూరం పెరిగిందని అంటున్నారు. ‘ఈ విషయంపై మాట్లాడానికి ఏమీ లేదు. కలిసి ఉండటానికి చాలా ప్రయత్నించాం కానీ కుదర్లేదు. నేను అంత రొమాంటిక్‌ వ్యక్తిని కాదు. నాకు వృత్తిపైనే శ్రద్ధ ఎక్కువ. వృత్తికి నూరు శాతం కట్టుబడి ఉండే వ్యక్తిని. బయటకు వెళ్లి సరదాగా తిరిగే వ్యక్తిని కాదు. అందరితో స్నేహపూర్వకంగా ఉండలేను. ఇలాంటి వ్యక్తిత్వంతో వ్యక్తిగత జీవితాన్ని గడపడం చాలా కష్టం" అని టైగర్ స్పందించాడు. టైగర్‌ వ్యక్తిత్వాన్ని దిశా అర్థం చేసుకోనందుకే బ్రేక్‌అప్‌ అయిందా అనే అనుమానాలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:అత్తారింటికి వెళ్తున్నపవర్ స్టార్

ఇవి కూడా చదవండి:మహేష్ బాబు ఇల్లు ఖరీదు ఎంతో తెలిస్తే షాకౌతారు!

ఇవి కూడా చదవండి:మెగా రెమ్యూనరేషన్ 30 కోట్లా!!

English summary

Bollywood Hero Tiger Shroff was presently enjoting the Sucess of his recent film "Bhaagi". Recently he open up on the relation with Heroine Disha Patani. He says that he was not such romantic and he said that they two tried to be ia relationship but it was not possible and that's the reason behid the breakup with Disha Patani.