అలా పుట్టాడు... ఇలా హీరో అయ్యాడు

Tiger Shroff became hero at childhood

11:58 AM ON 6th May, 2016 By Mirchi Vilas

Tiger Shroff became hero at childhood

అవునా, అయితే తెలుసుకోవాల్సిందే... హిందీలో 'హీరోపంటి' సినిమాతో టైగర్‌ ష్రాఫ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక టైగర్‌, శ్రద్ధా కపూర్‌లు నటించిన 'బాఘి' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. లెజండరీ నటుడు జాకీ దాదా(జాకీ ష్రాఫ్‌) తనయుడిగా బాలీవుడ్‌ ఇండస్ట్రీకి పరిచయమై కేవలం రెండు సినిమాలతోనే మోస్ట్‌ వాంటెడ్‌ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ టైగర్‌ పుట్టిన మరుక్షణమే హీరో అయిపోయాడట. అంతేకాదు సినిమా కోసం రూ. 21,000 పారితోషికం కూడా అందుకున్నాడు. ఈ విషయం టైగర్‌ ఓ ముంబయిలో జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘దర్శకుడు సుభాష్‌ ఘాయ్‌ అంకుల్‌ మా నాన్నకు మంచి స్నేహితుడు. నేను పుట్టినప్పుడు ఘాయ్‌ అంకుల్‌ నన్ను చూడ్డానికి వచ్చి అప్పుడే నన్ను తన సినిమాలోకి తీసుకోవాలనుకున్నాడు. అప్పుడు రూ. 21,000 నగదును కూడా నాన్నకి ఇచ్చారట. కాబట్టి ఇప్పుడు ఘాయ్‌ అంకుల్‌కి రుణపడి ఉన్నా. ఆయనతో కలిసి తప్పకుండా పనిచేస్తా’ అని టైగర్‌ చెప్పుకొచ్చాడు.

English summary

Tiger Shroff became hero at childhood. Tiger Shroff taken 21 thousand remuneration at childhood time.