ఆమెతో కాఫీ రిలేషన్ తప్ప ఎఫైర్ లేదట!

Tiger Shroff talks about his affair with Disha Patani

12:29 PM ON 19th August, 2016 By Mirchi Vilas

Tiger Shroff talks about his affair with Disha Patani

బాలీవుడ్ లో ఎఫైర్లకు, రూమర్లకు కొత్తేమీ లేదు. తాజాగా మరో ఎఫైర్ గురించి అంతా కోడై కూస్తున్నారు. రెండు సినిమాలతోనే కొత్త స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్న టైగర్ ష్రాఫ్, అతగాడి మోడల్ గాళ్ ఫ్రెండ్ దిశా పటానీల గురించే ఈ ఎఫైర్. తెలుగు ప్రేక్షకులకు లోఫర్ హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ, బాలీవుడ్ లో మాత్రం ఇంకా తెరంగేట్రం చేయలేదు. మొన్ననే ఈ రూమర్డ్ బాయ్ ఫ్రెండుతో కలసి ఒక పాటలో మెరిసింది. వీరి మధ్యన ఉన్న రిలేషన్ గురించి ఇప్పుడు టైగర్ ఏమంటున్నాడో తెలుసా? మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ను నేను దాచాలనుకోవడం లేదు. ఆమెతో సమయం గడపడం నాకిష్టం. బయట తిరుగుతాను కాఫీకి కూడా వెళ్తుంటాం.

అయితే అంతకు మించి మాత్రం ఏమీ లేదు అంటూ సెలవిచ్చాడు. అంటే కేవలం కాఫీ తాగే రిలేషన్ అనమాట వీరిద్దరిదీ. నిజంగానే దిశాతో తను ప్రేమాయణం నడిపిస్తున్నాడా లేదా అనే విషయంపై టైగర్ క్లారిటీ ఇవ్వకపోయినా, బాలీవుడ్ మీడియా మాత్రం ఎప్పటినుండో వీరిని ఫోటోలతో సహా క్యాప్చర్ చేసి కపుల్ అంటూ రాసేస్తోంది. అవన్నీ చూశాక కూడా, కాఫీకి మించి రిలేషన్ లేదంటే ఎవరు మాత్రం నమ్ముతారట. కాగా త్వరలో విడుదలవ్వనున్న ఎం.ఎస్.ధోని సినిమా ద్వారా బాలీవుడ్ కు పరిచయమవుతోంది దిశా పటానీ. ఆ సినిమాలో అమ్మడు ఒక చిన్న రోల్ చేస్తోంది. మరోవైపు టైగర్ ఏ ఫ్లయింగ్ జాట్ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు.

English summary

Tiger Shroff talks about his affair with Disha Patani