టైమెక్స్‌ నుంచి మెట్రోపాలిటన్‌ ప్లస్

Timex Metropolitan plus Watch

06:54 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Timex Metropolitan plus Watch

ప్రముఖ అంతర్జాతీయ వాచ్ ల తయారీ సంస్థ టైమెక్స్‌ మరో సరికొత్త వాచ్‌ని భారత మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. మెట్రోపాలిటన్‌ ప్లస్ పేరిట విడుదల చేసిన ఈ వాచ్‌ ఫిట్‌నెస్‌ ట్రాకర్‌గా కూడా పనిచేయనుంది. ఈ వాచ్‌కి బ్లూటూత్‌ సదుపాయం కూడా అందిస్తోంది. అంతేకాక దీనిని ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ స్మార్ట్‌ఫోన్‌లతో అనుసంధానం చేసుకోవచ్చు.

ఒకరోజులో మనం ప్రయాణించిన దూరాన్ని, మనం తీసుకున్న ఆహారం క్యాలరీస్‌ని ఈ వాచ్‌ ద్వారా తెలుసుకోవచ్చు. వాటర్‌ప్రూఫ్‌గా ఈ వాచ్ ను రూపొందించారు. దీని ధర రూ.9,995. ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ అమేజాన్‌ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు.

English summary

Timex company launched a new watch named Timex Metropolitan plus.The price of this watch was 9,995 rupees and it comes with the key features like Analogue Fitness Tracking facility.