ఎయిడ్స్ వ్యాధిని జయించిన యోధుడు!

Timothy Ray Is The First Person In The World To Be Cured Of AIDS

10:37 AM ON 13th September, 2016 By Mirchi Vilas

Timothy Ray Is The First  Person In The World To Be Cured Of AIDS

మనిషి తలచుకుంటే ఏదైనా సాధించగలడని ఎన్నోసార్లు నిరూపించాడు. కొత్త ఆవిష్కరణలు చేస్తూ తనదైన ముద్రవేస్తూ, తాజాగా మనిషి తానేమిటో నిరూపించాడు. ఎన్నో ఇళ్లనుంచి ఎయిడ్స్ మనుష్యులను పట్టిపీడిస్తోంది. ఈ వ్యాధికి మందు కనుగొనడంలో మాత్రం దశాబ్దాలుగా ఓటమిని చవిచూస్తున్నాడు. కానీ మనిషి తలచుకుంటే ఏదైనా సాధించగలడని నిరూపిస్తూ, ఓ వ్యక్తికి ఎయిడ్స్ వ్యాధి నయం చేశారట. దీంతో ప్రతీఒక్కరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తివివరాల్లోకి వెళ్తే,

తిమోతి రే బ్రౌన్ ఈ పేరు ప్రపంచమంతా మారుమోగిపోతోంది. ఎందుకంటే ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధిని జయించిన మొట్టమొదటి వ్యక్తి యోధుడు ఇతడే. అమెరికాకు చెందిన తిమోతికి 1995లో హెచ్ఐవీ సోకింది. క్రమంగా ఎయిడ్స్ వ్యాధిగా మారింది. చికిత్స కోసం తిమోతీ జర్మనీలోని బెర్లిన్ వెళ్లాడు. చికిత్స మొదలు పెట్టిన వైద్య బృందం తిమోతీపై జరిపిన పరిశోధనలకు అనూహ్యమైన ఫలితం వచ్చింది. ప్రపంచానికి సవాల్ విసిరిన ఎయిడ్స్ వ్యాధి తగ్గిపోయినట్లు తెలిసింది.

ఎయిడ్స్ వ్యాధిని తగ్గించేందుకు వైద్యులు 2007 నుంచి ‘స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్’ , ఇతర చికిత్సలు పెనుమోనియా, సెప్సిస్ లను తిమోతికి చికిత్సగా అందించారు. ఈ చికిత్సతో తిమోతీలో సీడీ4 కౌంట్ బాగా పెరగడంతో రోగనిరోధక శక్తి బాగా పెరిగింది. ఈ చికిత్సను నిరంతరంగా అందించడంతో తిమోతి రక్తంలో హెచ్ ఐవి వైరస్ తొలగిపోయింది. దీంతో వైద్య బృందం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్’ విధానం ద్వారానే తిమోతీ ఎయిడ్స్ వ్యాధిని నయం చేయగలిగామని వైద్య బృందం ప్రకటించింది.

ఇది కూడా చూడండి: రేప్ చేసే ముందు అమ్మాయిల్ని నయీమ్ దారుణంగా ఇలా చేసేవాడట

ఇది కూడా చూడండి: ఇతరులకు చెందిన ఈ 5 వస్తువులు ఎప్పటికీ వాడకూడదట!

ఇది కూడా చూడండి: ఆమె చదివింది పదే.. కానీ నెలకు 2 లక్షలు సంపాదిస్తుంది. ఎలాగో తెలుసా

English summary

Timothy Ray Brown is an American. He Is the first person in the world to be cured of AIDS.He is popularly known as Berlin patient.