కోళ్ళు స్వెటర్స్‌ తొడుకున్నాయోచ్‌..!

Tiny wool sweters for chickens

05:50 PM ON 21st November, 2015 By Mirchi Vilas

Tiny wool sweters  for chickens

చలికాలం వస్తుందంటే చాలు బీరువాలో దాచిన స్వెటర్లు బయటకు తీస్తాము మనమంతా.చక్కగా వేసుకొని వెచ్చవెచ్చగా చలికాలాన్ని ఎంజాయ్‌ చేస్తాం..కాని మీ ఇంటి ముందు కోళ్ళు ఉన్నాయని వాటికీ చలి వేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా ఒక అమ్మాయి ఆలోచించి కోళ్ళకి కూడా ఒక ట్రెండ్‌ని సెట్‌ చేసింది. వివరాల్లోకి వెళితే ఇంగ్లాండు కి చెందిన ఒక యువతి కోళ్ళఫాం ని నడుపుతుంది.ఆమె దగ్గర దాదాపు 60 కోళ్ళు ఇంకా 30 కోడి పుంజులు ఉన్నాయి. చలి కాలంలో అవి పడే బాధని చూడలేక చలించిపొయిన నికోలా అనే అమ్మడు వాటి కోసం బుల్లిబుల్లి స్వెటర్స్‌ని తయారు చేసింది.అవి వేసుకొని ఆ కోళ్ళు వెచ్చగా ఏ ఇబ్బంది పడకుండా సంతోషంగా ఉన్నాయని లేదంటే చలికాలం వస్తే చాలు అవి వాటి రెక్కలనే దుప్పటిలాగ మలుచుకుని పడుకునేవని ఆమె తెలిపింది.

ఈ చిత్రాలను తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో మంచి రెస్పాన్స్ వచ్చిందట. ఇతరుల నుండి అలాంటి స్వెటర్స్ తమకూ కావాలని, తయారు చేసి ఇవ్వమని చాలా మంది ఈ అమ్మడిని అడుగుతున్నారట. ఈ వ్యాపారంలో వాళ్ళు గడించిన సొమ్మును ఎయిడ్స్‌ భాదితులకు విరాళంగా అందించనున్నట్లు నికోలా, ఆమె తల్లి తెలియజేసారు. చూసారా కోళ్ళకు కొత్త ఫ్యాషన్లను నేర్పడమే కాకుండా, వాటిని మంచి వ్యాపార అవకాశంగా మలచుకుంది నికోలా.

English summary

Tiny wool sweters for chickens. Nicola and her mom are now receiving special requests for jumpers from hen keepers near and far.