నోటి దుర్వాసన నుండి విముక్తి !!

Tips for bad Breath

12:18 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Tips for bad Breath

నోటి దుర్వాసనని చెడు శ్వాస అని కూడా అంటారు. దీనివల్ల చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. నలుగురిలో మాట్లాడలేరు, నిలబడలేరు. కొంత మందికి వారు తినే ఆహారం వల్ల ఇలాంటి సమస్య రావచ్చు. సరిగా పళ్ళు తోముకోకపోవడం వలన, చిగుళ్ళ ఇన్‌ఫెక్షన్‌, పంటినుండి రక్తం కారడం, పొడిబారిన నోరు, పొగాకు వాడడం, కొన్ని వ్యాధుల వలన ఈ విధమైన ఇబ్బందికి గురవుతారు. అలాగే కొన్ని పదార్ధాలను సేవించడం వలన కూడా ఈ ఇబ్బంది కలుగుతుంది. వెల్లులి, ఉల్లిపాయ, పొగాకు ఇలాంటివి తిన్నప్పుడు నోటిని శుభ్రపరుచుకోవాలి. ఇలాంటి వాటివల్ల కాకుండా కొంతమంది ఎన్నివిధాలుగా శుభ్రపరిచుకున్నా వారి నోరు దుర్వాసన వస్తుంది. అలాంటి వారు ఏమైనా ఉదర సంబంధవ్యాదులు ఉన్నాయేమో చూపించుకోవడం మంచిది. కొంతమంది శుభ్రత లేకపోవడం వలన ఈ సమస్యను ఎదుర్కొంటారు. చిగుర్ల సమస్యతో బాధపడేవారు ఇంకా నోటికి సంబందించిన ఇబ్బందులు కలవారు బాధపడాల్సిన అవసరం లేదు. నోటిని శుభ్రంగా ఉంచుకోవడం వలన అన్ని సమస్యలనుండి బయట పడవచ్చు.

ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో కొన్ని చిట్కాలు చూద్ధాం

 • రోజుకి రెండుసార్లు పళ్ళు తోముకోవాలి.
 • పళ్ళు సందులో ఆహారం ఉండిపోకుండా, తిన్నవెంటనే నోటిని నీళ్ళువేసుకొని పుక్కిలించి శుభ్రంచేసుకోవాలి.
 • ఇలా పళ్ళమధ్య ఆహారం ఉండిపోవడం వలన క్రిములు ఏర్పడతాయి. అందువల్ల ఏమైన తిన్నవెంటనే నోటిని శుభ్రపరుచుకోవాలి.
 • ఆల్కహాలు కలిగిన పానీయాలను సేవించడం మానుకోవాలి.
 • మీ టూత్‌బ్రెష్‌తో నాలుకని శుభ్రపరుచుకోవాలి.
 • 6 నెలలకి ఒకసారి మీదంతవైద్యుని దగ్గరకు వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలి.
 • నీరు పుష్కలంగా తాగాలి. దానివల్ల నోరు పొడిబారకుండా ఉంటుంది.అలాగే శరీరంలోని మలినాలు తొలగిపోతాయి.

ఇంటి చిట్కాలు

 • సోపుగింజలు, ఏలకులు లేదా పుదీనా తినడం వలన నోటిదుర్వాసన అరికట్టవచ్చు.
 • బోజనం తరువాత 2 లవంగాలు నమలడం వలన మంచి ఫలితం ఉంటుంది.
 • లేతజామ ఆకులు నమలడం వలన చెడుశ్వాసని వదిలించుకోవచ్చు.
 • నీటిలో కొన్ని జామఆకులు వేసి 10 నిమిషాలపాటు వేడిచేయాలి. వేడిచేసిన నీటిని మౌత్‌వాష్‌ గా ఉపయోగించాలి.
 • పార్స్లీ ఆకులు చెడు శ్వాసని తరిమికొడతాయి. కొన్నిపార్స్లీ కొమ్మలను 2 కప్పుల నీటిలో వేసి వేడిచేయాలి. చల్లారిన తరువాత అనేక సార్లు పుక్కిలించి ఊసేయాలి. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 • రోజూ రాత్రి బోజనం చేసిన తరువాత ఉప్పు నీటితో పుక్కిలించి ఉమ్మివేయాలి.

ఈ చిట్కాలన్నీ తత్కాలికమైన సమస్యల కోసమే ఒకవేళ ఏంచేసినా మీశ్వాస చెడుగానే ఉంటే ఏదో సమస్యతో భాధపడుతున్నారని అర్ధం. అటువంటి వారు వెంటనే దంత వైద్యుని సందర్శించడం మంచిది. ఆయన ఇచ్చే సూచనలను తూచా తప్పకుండా పాటించడం వలన మీరు తొందరగా దీనినుండి విముక్తిపొందుతారు.

English summary

Tips for bad Breath. Bad breath also called halitosis. Bad breath is very embarrassing follow these steps to get rid of bad breath