అందమైన ముఖానికి సహజమైన చిట్కాలు

Tips for beautiful skin

07:32 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Tips for beautiful skin

చర్మం దోష రహితంగా, కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు, మొటిమలు లేకుండా ఉండటానికి మనకు ప్రాధమిక  CTM టెక్నిక్ ... ప్రక్షాళన(క్లెన్సర్) -టోనర్-మాయిశ్చరైజర్ గురించి బాగా తెలుసు. మార్కెట్ లోకి కొత్తగా వచ్చే ఫేస్ వాష్, సన్ స్క్రీన్, యాంటి ఏజింగ్ క్రీం వంటి వాటిని కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే పొడిచర్మం,జిడ్డు చర్మం,మచ్చల చర్మం,కాంబినేషన్ చర్మం అని అనేక చర్మ రకాలు ఉంటాయి. అందమైన చర్మం పొందాలంటే ప్రయత్నాలు తప్పనిసరిగా చేయాలి. ఈ ప్రయత్నం అనేది ఒక్క రోజులో అయ్యే పని కాదు. అయితే మనం ముఖ సంరక్షణను తేలికగా మరియు సులభంగా చేసుకోవచ్చు.

ఇక్కడ మన చర్మ సంరక్షణ సమస్యలను పరిష్కరించటానికి మరియు ముఖం ఎప్పుడు ప్రకాశవంతంగా మేరవటానికి చిట్కాలు మరియు బ్యూటీ రహస్యాలు ఉన్నాయి. ఉత్సాహంగా,సంతోషంగా ఉంటే చర్మ సమస్యలు తొందరగా దూరం అవుతాయి. సహజమైన అందం కొరకు ప్రతి రోజు చర్మ సంరక్షణ చిట్కాలను పాటించాలి.

1/11 Pages

1. గోల్డెన్ రూల్

రాత్రి సమయంలో మేకప్ ని తప్పనిసరిగా తీసేయాలి. ఎందుకంటే చర్మానికి బ్రీత్ అవసరం. రాత్రి సమయంలో మేకప్ తీయకుండా ఉంటే మచ్చలు ఏర్పడటం,బ్లాక్ హెడ్స్ ఏర్పడటం మరియు చర్మ రంద్రాలకు అడ్డంకులు ఏర్పడటం వంటివి జరుగుతాయి. మేకప్ ని తీయటానికి కాటన్ బాల్ పై కొన్ని చుక్కల ఆలివ్ నూనెను వేసి ముఖం మీద నెమ్మదిగా మసాజ్ చేస్తే దుమ్ము మరియు మేకప్ తొలగిపోతుంది.

వారంలో ఒకసారి లేదా రెండు సార్లు తప్పనిసరిగా ఎక్స్ ఫ్లోట్ చేయాలి. ఇది చనిపోయిన చర్మం పొరలను తొలగించటానికి సహాయపడుతుంది. అప్పుడు చర్మం మరింత ఆరోగ్యకరమైన మెరుపు మరియు ప్రకాశవంతంగా ఉంటుంది.  వాల్నట్ పొడిలో పెరుగు వేసి పేస్ట్ గా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాయాలి.  వాల్నట్ లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ మలినాలను తొలగించి ప్రకాశవంతమైన చర్మాన్ని ప్రోత్సహిస్తాయి.

English summary

If dry skin and dead skin, oily skin and patchy skin weren’t enough - you now have combination skin! And we are ever so willing to try anything under the sun to get beautiful skin.