పాదాల మంట తగ్గటానికి చిట్కాలు

Tips for burning sensations feet

03:10 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Tips for burning sensations feet

పాదాల మంటలు  అనేవి ఏ వయస్సు వారిని అయినా భాదిస్తాయి. అయితే 50 సంవత్సరాల వయస్సు వారిలో ఎక్కువగా వస్తాయి. పాదాల మంటలకు అనేక కారణాలు ఉంటాయి. అవి సాదారణంగాను మరియు తీవ్రంగాను ఉంటాయి. సాదారణంగా ఈ సమస్య పాదాల యొక్క  నరాల బలహీనత, నష్టం మరియు అలసట వల్ల ఏర్పడుతుంది.  అలాగే ఎక్కువసేపు నిలబడటం వలన కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు పాదాల మంట ప్రారంభం అయినప్పుడు వాపు, చర్మం పొట్టు రాలిపోవటం, చర్మం రంగు మారటం, ఎరుపుదనం వంటివి ఉంటాయి. పాదాల మంట తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సలహాని తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఈ సమస్య ప్రాధమిక
దశలో ఉంటే మాత్రం సహజ నివారణలతో ఇంట్లోనే నివారించవచ్చు.

1/6 Pages

1. వేడి మరియు చల్లని నీటిని కాపడం పెట్టటం

పాదాల వద్ద రక్త ప్రసరణ పెరిగితే పాదాల మంట తగ్గుతుంది. వ్యాయామం అనేది మొత్తం శరీరం అంతా రక్త ప్రసరణ విస్తరించేందుకు సహాయపడుతుంది. అయితే,కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో రక్త ప్రసరణ విస్తరించేందుకు వేడి మరియు చల్లని నీటిని కాపడం పెట్టటం చేయాలి. ఒక బకెట్ లో చాలా వేడి నీరు, మరో బకెట్ లో చల్లని నీటిని తీసుకోవాలి. వేడినీటిలో ఒకసారి,మరొక సారి చల్లని నీటిలో పాదాలను మారుస్తూ పెట్టాలి. ఈ విధంగా 15 నిమిషాల పాటు చేయాలి. ఈ పద్దతిని ప్రతి రోజు చేస్తే పాదముల రక్త ప్రసరణ పెరగటానికి సహాయపడుతుంది. అంతేకాక పాదాల నొప్పి మరియు పాదాల మంటను సమర్ధవంతంగా నయం చేస్తుంది.

English summary

Here are the tips of burning sensation feet. Follow these health tips you get burning free feet. To get rid of this burning sensation of feet one has to increase blood circulation at feet. Over all exercise of the whole body helps to enhance blood circulation in our body.