పగిలిన మడమలకు విముక్తి !!

Tips for cracked heels

06:37 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Tips for cracked heels

చలికాలం వచ్చిందంటే చాలు అందరూ ఈ పగుళ్ళ సమస్యకి గురవుతారు. చాలా మంది ఆడవారు, మగవారు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది పొడిబారిన చర్మం వల్ల కూడా వస్తుంది. ఇలాంటి పగుళ్ళతో బాధ పడేవారు ఈ చిట్కాలను పాటించడం వల్ల పగిలిన మడమలను నుండి విముక్తి లభిస్తుంది. ఈ చిట్కాలను పాటించే ముందు మీ పాదాలను బ్రష్‌తో రుద్ధి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి.పగిలిన మడమలకు విముక్తి

1/8 Pages

1. పాలు మరియు ఆలిల్‌ ఆయిల్‌ 

పాలు, ఆలివ్‌ ఆయిల్‌ మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి. వీటిని వాడడం వల్ల మంచి ఫలితం పొందుతారు.

కావసినవి:

  • ఒక కప్పు పాలు
  • ఆలివ్‌ ఆయిల్‌ 2 టీ స్పూన్స్‌

ఉపయోగించే పద్ధతి:

  • ఒక టబ్ తీసుకొని దాని నిండా గోరువెచ్చని నీటితో నింపాలి.
  • టబ్ లో పాలు, ఆలివ్‌ ఆయిల్‌ వేసి బాగా కలపాలి.
  • మీ పాదాలను ఆ నీటి లో 20 నిమిషాల పాటు నాన పెట్టాలి . మీరు మీకు నచ్చిన పుస్తకం చదవడం లేదా పాటలు వినడం చేయవచ్చు. ఇలా చేయడం వలన మనస్సుకి ప్రశాంతత చేకూరుతుంది. అదే సమయం లో మీ కాళ్ళు కూడా శుబ్రపడతాయి.
  • ఇలా 20 నిమిషాలు గడిచిన తరువాత పాదాలు మెత్తగా మారతాయి. వాటిని మృదువుగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మృతకణాలు కూడా తొలగిపోతాయి.

English summary

Healthy and soft looking heels after following these home remedies.