పాదాల సంరక్షణకు పాటించాల్సిన చిట్కాలు

Tips for foot care

11:38 AM ON 11th March, 2016 By Mirchi Vilas

Tips for foot care

సాదారణంగా ప్రతి ఒక్కరు అందమైన మరియు మృదువైన పాదాలు కావాలని కోరుకుంటారు. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే అందమైన పాదాలు ఉంటాయి. మొత్తం శరీర బరువు అంతా పాదాలపై పడుట వలన, పాదాలు గాయాలు,అలసట మరియు ఇన్ ఫెక్షన్స్ కి గురి కావచ్చు.  పాదాలను నిర్లక్ష్యం చేస్తే పాదాల నొప్పి మరియు అనేక సమస్యలు వస్తాయి. అందువలన పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోవటానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

1/11 Pages

1. ప్రతి రోజు పాదాలను కడగాలి

శరీరంలో ఇతర బాగాలు కన్నా పాదాలలో చెమట ఎక్కువగా ఉంటుంది. అందువల్ల క్రమం తప్పకుండా పాదాలను కడగాలి.  రోజు ప్రారంభంలో ఒకసారి రోజు చివర ఒకసారి పాదాలను కడగటం అలవాటు చేసుకోవాలి. చెమట, ధూళి మరియు బ్యాక్టీరియా వదిలించుకోవటానికి ఒక తేలికపాటి సబ్బు లేదా యాంటిసెప్టిక్ సబ్బు మరియు గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. ఎక్కువ వేడి ఉన్న నీటిని ఉపయోగించకూడదు. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటే పాదాలలో సహజ నూనెలు తగ్గిపోవటమే కాక పాదాల పగుళ్ళకు కారణం అవుతుంది. పాదాలను కడిగిన వెంటనే పొడిగా తుడుచుకోవాలి. లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

English summary

Your feet take the weight of your whole body and go through a lot of wear and tear, making them susceptible to injury, fatigue and infections. So you take care of your foot carefully. Follow these steps you get smooth and healthy foot.